Sunday, 25 August 2024

HYDRA | హైడ్రా చట్టబద్ధమేనా?.. రాజ్యాంగ సంస్థల అధికారాల పరిధిలోకి చొరబాటు!

 


HYDRA | హైడ్రా చట్టబద్ధమేనా?.. రాజ్యాంగ సంస్థల అధికారాల పరిధిలోకి చొరబాటు!

 

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన స్థానిక సంస్థల అధికారాల్లోకి హైడ్రా చట్ట విరుద్ధంగా ప్రవేశించిందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీవో-99 ప్రకారం టీసీయూఆర్‌ పరిధిని హైడ్రాకు అప్పగించారు.

  • ఓఆర్‌ఆర్‌ వరకు పరిధి విస్తరణ చెల్లుతదా?
  • ఈవీడీఎం అధికారాలను ఇంకా రద్దు చేయకుండానే హైడ్రాను రుద్దిన సర్కార్‌
  • చట్టం లేకుండానే హైడ్రాకు హక్కులెట్ల?
  • ఓఆర్‌ఆర్‌ వరకు టీసీయూఆర్‌ పరిధి
  • నిర్ధారణలో చట్టపరమైన సమస్యలెన్నో
  • హైడ్రా రాజ్యాంగ ఉల్లంఘనే: నిపుణులు

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై దూకుడుగా వ్యవహరిస్తున్న హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌(టీసీయూఆర్‌) పరిధికి సంబంధించి ప్రభుత్వం చట్టం చేయలేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు.

                   హైదరాబాద్‌,: రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన స్థానిక సంస్థల అధికారాల్లోకి హైడ్రా చట్ట విరుద్ధంగా ప్రవేశించిందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీవో-99 ప్రకారం టీసీయూఆర్‌ పరిధిని హైడ్రాకు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాలతోపాటు ఔటర్‌ రింగురోడ్డు లోపలి ప్రాంతాలు టీసీయూఆర్‌ పరిధిలో ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, టీసీయూఆర్‌ పరిధికి సంబంధించి సరియైన చట్టం చేయలేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఉత్తర్వులు ఇస్తే సరిపోదని, సరైన చట్టం కూడా చేయాలని స్పష్టం చేస్తున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ లోపించిందనే కారణంతో హైడ్రాను జీహెచ్‌ఎంసీ పరిధికి మించి ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించడం కూడా చట్టబద్ధం కాదని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ వెలుపల ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై రుద్దడం గ్రామ పంచాయతీ యాక్ట్‌ మున్సిపల్‌ యాక్ట్‌కు విరుద్ధమని, ఇది ఆయా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారాలను ఉల్లంఘించడమేనని పేర్కొంటున్నారు.

స్థానిక సంస్థల అధికారాల్లో జోక్యం
జీవో-99 ప్రకారం టీసీయూఆర్‌ పరిధిలో విపత్తుల నిర్వహణ కోసం హైడ్రాను ఓ ఏకీకృత ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం-2008 తదితర వాటితోపాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అధికారుల అధికారాలను స్వాధీనం చేసుకున్నది. ఒకవేళ హైడ్రాను ఔటర్‌ రింగురోడ్డు పరిధి వరకు ఏర్పాటుచేస్తే, అందులోని ప్రస్తుతమున్న జీహెచ్‌ఎంసీ సహా స్థానిక సంస్థల చట్టాల్లో సైతం ఆ మేరకు సవరణలు చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. లేనిపక్షంలో ఆయా ఏజెన్సీలకు చెందిన అధికారాల పరిధిలోకి హైడ్రా చొచ్చుకొని పోయినట్లేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారాలకు సంబంధించి సరియైన చట్టబద్ధత లేదని స్పష్టం చేస్తున్నారు.

ఈవీడీఎం ఉనికి ఉందా, లేదా?
మరోవైపు, విపత్తుల నివారణకు జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) విభాగం ఉంది. దీని అధికారాలు, విధులకు సంబంధించి స్పష్టత ఉంది. ఈవీడీఎం స్థానంలో హైడ్రాను తెచ్చినప్పటికీ ఈవీడీఎం అధికారాలు రద్దు చేస్తున్నట్టు ఎక్కడా చట్టం చేయలేదు. చట్టబద్ధంగా ఏర్పడ్డ అనేక సంస్థలు, అధికారులను నియంత్రించే అధికారాలు ఎటువంటి చట్టం లేకుండానే హైడ్రాకు కల్పించడాన్ని తప్పుబడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం హైడ్రా వంటి ఏజెన్సీని ఏర్పాటు చేయాలనుకుంటే దాని అధికారాలు, పరిధికి సంబంధించి శాసన ప్రక్రియ ద్వారా కొత్తగా చట్టాన్ని చేసి ఉండాల్సిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీయూఆర్‌ పరిధిని ఓఆర్‌ఆర్‌ వరకు నిర్ధారించడంతో అనేక చట్టపరమైన సమస్యలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా జీఓ-99లో భాగంగా హైడ్రాకు కల్పించిన అధికారాలకు ఎటువంటి చట్టబద్ధత లేదనని, ఈ జీఓకు సంబంధించి చట్ట పరమైన ఫ్రేమ్‌వర్క్‌ లేదని అంటున్నారు. స్థానిక సంస్థలుగా ఉన్నా ప్రాంతాల్లో హైడ్రా అధికారం చెలాయించడం అక్కడి స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తికి, అధికారాలకు భంగం వాటిల్లుతుందని చెప్తున్నారు.


No comments:

Post a Comment