Tuesday, 6 August 2024

స్వచ్ఛదనం - పచ్చదనం లో అందరూ భాగస్వాములు కావాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

 స్వచ్ఛదనం - పచ్చదనం లో అందరూ భాగస్వాములు కావాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

నగరంలో పచ్చదనం పరిశుభ్రత పెంపొందేలా ప్రజలు సహకరించాలి: కమిషనర్ ఆమ్రపాలి కాట

హైదరాబాద్, ఆగస్టు 05:   స్వేచ్ఛ ధనం - పచ్చదనం అందరి సామాజిక బాధ్యత అని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.  

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ జోన్ 

ఎన్ బి టి నగర్ లో స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ఆమ్రపాలి కాట, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

    


ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ... నగరంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరాన్ని స్వచ్ఛ ఆరోగ్య ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దుట కు ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటితోపాటు బయట కూడా స్వచ్ఛంగా ఉండేలా బాధ్యత వహించాలన్నారు. నగరంలో 4 వేలకు పైగా స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ జరిగిన ఇంకా చెత్త బయట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త సేకరణ బండ్లకు తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరు నా కెందుకులే అనుకోకుండా ముందు మన నుండి మార్పు రావాలని అనుకోవాలన్నారు. ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చినప్పుడే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. ఎన్.బి టి  నగర్ ను పరిశుభ్రత ఆదర్శంగా వార్డు గా తీర్చి దిద్దుటకు ప్రజల సహకారం అవసరం ఉందన్నారు. స్వచ్చ ఆటో వాళ్ళకు చెత్త వేయాలని  జి వి పి లను ఉదయం క్లీన్ చేస్తే సాయంత్రం వరకు యథ విధిగా మళ్ళీ చెత్త కూరుకుపోతుందని అన్నారు. అలాంటి పరిస్థితి చదువుతున్న వారే ఇలా చేస్తున్నారని మేయర్ అన్నారు. మన ఇళ్లు శుభ్రంగా ఉంటే చాలనుకుంటే సరిపోదని మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా తమ వంతు కృషి చేయాలన్నారు. చెత్త బయట వేస్తే జరిమానా వేస్తామని ప్రజలకు చెప్పారు. జీవీపీ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్త కుండీ పాయింట్స్ ఎలిమినేట్ చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

    ఈ సందర్భంగా  జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ... నగరంలో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు గ్రేటర్ వ్యాప్తంగా 5 రోజుల పాటు సుందరీకరణ తో పాటు పరిశుభ్రత పనులు చేపడుతున్నామని తెలిపారు. స్వఛ్చ దనం - పచ్చధనం పేరుతో నేటి నుండి ఆగస్టు 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో శుభ్రత మరింత పెంచేందుకు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. నగర ప్రజలు రోడ్ల మీద చెత్త వేయడం మానుకోవాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో చెత్త రోడ్ల మీద వేయకుండా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

             దోమల నివారణ, వ్యాధుల నియంత్రణకు  అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. అందరూ ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని కోరారు. కుక్కల నుండి జాగ్రత్తగా ఉండాలని, చిన్న పిల్లలను  తల్లిదండ్రులు ఒంటరిగా బయటకు   దుకాణాలకు పంపొద్దని సూచించారు. కుక్కల బెడద  కుక్క కాటు చర్యల నివారణకు  కుక్కల స్టెరిలైజ్ చేయుటకు చర్యలు తీసుకున్నట్లు   అందుకోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. స్టెరిలైజ్ అవ్వని కుక్కలు ఉన్నట్లయితే గమనించి జిహెచ్ఎంసి కి ఫిర్యాదు చేయాలన్నారు. స్టెరిలైజేషన్ కానీ కుక్కలు చెవులు  కట్ చేసి ఉండవని వాటికి  స్టెరిలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. మన మహోత్సవంలో భాగంగా నగరంలోని పార్కుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో క్రీడా మైదానాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు.



 ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ...  ప్రతి ఒక్కరూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలని, రోడ్డు మీద చెత్త వేయొద్దని ఉద్భోదించారు. ఖైరతాబాద్ పరిధిలో 700 స్వచ్చ ఆటోలు ఇంటింటి నుండి చెత్త సేకరణ చేస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెత్తను బయట వేయకుండా స్వచ్చ ఆటోలకే చెత్త ను అందజేయాలని కోరారు. స్వచ్చ పరిశుభ్రత చెత్త,  సేకరణకు సర్కిల్ కు అదనంగా ఇక వాహనం ఏర్పాటు చేసినట్లు వివరించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కు 24x7  సిబ్బంది తో పాటు అవసరమైన వాహనాలను సిద్ధం గా పెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా  డెంగ్యూ వ్యాధి కి సంబంధించిన  స్టిక్కర్ ను విడుదల చేశారు

        ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు, వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- సిపిఆర్ఓ జిహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.

No comments:

Post a Comment