తిరుమలలో ప్రక్షాలణ మొదలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల నుంచి ప్రక్షాలణ మొదలుపెడుతామని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అనుకున్నట్లే తిరుమలకు కొత్త ఈవో, కొత్త అదనపు ఈవో వచ్చారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శ్రీవారి భక్తలు సమస్యలపై స్పందిస్తున్నారు. టీటీడీ అధికారులు, ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తోంది. తిరుమలలో ఇప్పటికే రుచికరమైన అన్నప్రసాదం అందిస్తున్నారు. తిరుమల వైకుంఠం కాప్లెక్స్ ల్లో నాలుగు చోట్ల అన్నప్రసాదం పంపిణి చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండే శ్రీవారి భక్తులకు అన్నప్రసాదంతో పాటు, పాలు, మజ్జిగ, అల్ఫాహారం అందివ్వడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక శ్రీవారి భక్తులు బస చేస్తున్న విశ్రాంతి భవానాల్లోని సౌకర్యాలపై టీటీడీ ఈవో శ్యామలరావు ప్రత్యేక శ్రద్ద పెట్టారు.తిరుమలలోని అన్ని విశ్రాంతి భవనాలు పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు ఆ భవానాల్లో వేడి నీళ్లు వస్తున్నాయా, టాయిలెట్స్, బాత్ రూమ్ లు ఎలా ఉన్నాయి, బెడ్స్ ఎలా ఉన్నాయి అని పరిశీలించారు. తిరుమల విశ్రాంతి భవనాల్లోని అన్నింటిని శ్యామలరావు పరిశీలించారు. సౌకర్యాలు సక్రమంగా లేని విశ్రాంతి భవనాలను వెంటనే సరిచెయ్యాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
No comments:
Post a Comment