Monday, 26 August 2024

ఇంటి అద్దెలతోనే బతుకుతున్నారా? మరి ఆదాయ పన్ను చెల్లించాలా? రెంట్ ఎంత వస్తే టాక్స్ కట్టాలి?


 ఇంటి అద్దెలతోనే బతుకుతున్నారా? మరి ఆదాయ పన్ను చెల్లించాలా? రెంట్ ఎంత వస్తే టాక్స్ కట్టాలి?

     : మన దేశంలో స్థిరాస్తి అద్దెతో వచ్చే ఆదాయం.. ఇన్‌కంటాక్స్ చట్టాల పరిధిలోకి వస్తుందన్న సంగతి తెలిసిందే. చాలా మంది ఇలా ఇంటి అద్దెలపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే.. ఇక్కడ దీనిపై టాక్స్ పడితే వారి ఆదాయం తగ్గుతుందని చెప్పొచ్చు. అసలు ఎంత వరకు అద్దె ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో ఏమైనా పన్ను తగ్గించుకునేందుకు మార్గాలుంటాయా.. తెలుసుకుందాం.

     : దేశంలో ధనవంతులు, ఏ పని చేయలేని పెద్దవారు సహా రిటైర్మెంట్ అయినవారు ఇంటి అద్దెలు, ఇతర స్థిరాస్తిపై వచ్చే అద్దెలతోనే తమ జీవనం సాగిస్తుంటారు. కొందరికి ఈ అద్దెలే పూర్తిగా జీవనాధారం అని చెప్పొచ్చు. అయితే.. ఈ అద్దె ఆదాయంపై పన్ను ఉంటే మాత్రం వారి ఆదాయం తగ్గిపోతుంది. వీటిపై ఆదాయపు పన్ను ఉంటే గనుక అప్పుడు ఈ టాక్స్‌ల నుంచి ఎలా రాయితీ పొందాలి. ఎంత వరకు రాయితీకి అవకాశం ఉంటుంది. అసలు రెంటల్ ఇన్‌కం ఎంత వరకు ఉంటే పన్ను కట్టనక్కర్లేదు. అద్దె ఆదాయం పొందే ప్రతి యజమాని కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

                    భారత్‌లో స్థిరాస్తి రెంట్‌తో వచ్చే ఆదాయం.. ఇన్‌కంటాక్స్ చట్టాల పరిధిలోకే వస్తుంది. అయితే.. ఈ యజమానులకు అద్దె ఆదాయంపై .. పన్ను చట్టంలోని ఎన్నో ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడిగా ఆస్తి కొన్నా.. దానిపై వచ్చే ఆదాయంపై పన్ను బెనిఫిట్స్ ఉంటాయి.

                     ఎవరైనా వ్యక్తి.. పన్ను శ్లాబు రేటు ప్రకారం.. ఇంటి అద్దె ఆదాయంపై పన్ను విధిస్తారు. ఉదాహరణకు.. వ్యక్తికి ఇతర ఆదాయం లేకుండా.. ఆర్థిక సంవత్సరంలో రూ. 2.50 లక్షల కంటే తక్కువ ఆదాయం మాత్రమే వస్తే.. అప్పుడు ఆదాయపు పన్ను విధించదగిన కనీస పరిమితి కంటే తక్కువగానే ఉన్నందున పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. తర్వాతి సంవత్సరంలో అద్దె ఆదాయం 20 శాతం పెరిగితే గనుక.. మనం నిర్దిష్ట పన్ను ప్రయోజనాలను బట్టి పన్ను లేకుండా చూసుకోవచ్చు.

                 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా.. స్థిరాస్తి యజమాని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గించుకోవచ్చు. ఇక్కడ అద్దె ఆదాయం పొందే యజమాని.. వారికి నికర ఆస్తి విలువపై 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఒక వ్యక్తి స్థిరాస్తి నుంచి రూ. 3.60 లక్షలు పొందితే.. మున్సిపల్ పన్నులు రూ. 30 వేలు అనుకుంటే.. అద్దె ఆదాయం రూ. 3.30 లక్షలని చెప్పొచ్చు. దీనిపై 30 శాతం అంటే.. రూ. 99 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కింద తగ్గించుకొని.. ఆదాయం రూ. 2.31 లక్షలుగా పరిగణించొచ్చు. అప్పుడు ఆదాయపు పన్ను పరిధి కంటే తక్కువ ఉంటుంది కాబట్టి టాక్స్ కట్టక్కర్లేదు.

                      మీరు హోం లోన్‌పై చెల్లించే వడ్డీపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. చెల్లించే వడ్డీపై రూ. 2 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. ఇల్లు అద్దెకు ఇచ్చినప్పుడు రూ. 2 లక్షల పరిమితి వర్తించదు. అసలు మొత్తంపైనా రూ .1.50 లక్షలు బెనిఫిట్ పొందొచ్చు. ఉమ్మడిగా ఆస్తి కొని.. అప్పుడు లభించే అద్దె ఆదాయంపైనా టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.

మీరు యజమానిగా ఆదాయపు పన్ను ప్రయోజనాల్ని క్లెయిమ్ చేసేందుకు యోచిస్తుంటే.. అప్పుడు అద్దె ఒప్పందం, ఆస్తి పత్రాలు వంటివి కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ.. పన్ను విభాగం.. రెంటల్ ఇన్‌కంకు సంబందించి వివరాలు కోరితే.. మీరు వీటిని ప్రూఫ్స్‌తో సబ్మిట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

No comments:

Post a Comment