Monday, 5 August 2024

**తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి:ప్రజా ఏక్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ **

 **తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి**


అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా, తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం ఎంత మాత్రం సబబు కాదు అని ప్రజా ఏక్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ 


అన్నారు.సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణకు చేసిన సేవలు చిరస్మరణీయమే, కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించి వారి పేరు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు అని అన్నారు.ఇతర ప్రభుత్వ సంస్థలకు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని, ప్రభుత్వం వెంటనే తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు మార్పు ఆలోచన విరమించుకోవాలని శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సోదరులు సోమవారం నాడు మండల స్థాయిలో  తహశీల్దార్ కు , డివిజన్ స్థాయిలో ఆర్డీవోలకు, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి నిరసన వ్యక్తం చేయాలని ఆయన పిలుపనిచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బోనాల శ్రీనివాస్ తెలిపారు.

No comments:

Post a Comment