ముందు వరసలో మహాసభ - వెనుక బడ్డ IVF, WAM, వాసవి క్లబ్, ACPS, వాసవి సేవా సమితి, avopa
హైద్రాబాద్:
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించకూడదని డిమాండ్
చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నిరసన తెలపడం లో ముందుంది. వెనుక బడ్డ IVF, WAM, వాసవి క్లబ్, ACPS, వాసవి సేవా సమితి, avopa లు ఇంకా ఎలాంటి స్పందన చేయునట్లు ఉంది. అన్ని సంఘాలు కలసి పొట్టి శ్రీరాములు పేరు మార్పు ను అడ్డుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారు.
ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరుకు బదులుగా సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని భావించడం ఎంతమాత్రము సరికాదు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణకు అందించిన సేవలు చిరస్మరణీయం. అందులో ఎంతమాత్రము సందేహం లేదనీ. కాని ప్రతాప్ రెడ్డి గని గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం భావ్యంకాదని మహాసభ ప్రకటనలో పేర్కొంది.
సురవరం ప్రతాప్ రెడ్డి జ్ఞాపకార్ధం ఏదేని కొత్త ప్రాజెక్ట్కు వారి పేరు పెట్టి సముచిత రీతిలో గౌరవించాలని, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భావితరాలకు తెలియజెప్పే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి వారి పేరే ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరపున ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నామనీ ప్రకటనలో తెలిపింది
No comments:
Post a Comment