Saturday, 24 August 2024

ఆర్య వైశ్యులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకే అబుదాబిలో గ్లోబల్ కన్వెన్షన్ - మీడియా కమిటీ చైర్మన్ కౌటికె విఠల్



ఆర్య వైశ్యులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకే అబుదాబిలో గ్లోబల్ కన్వెన్షన్ - కౌటికె విఠల్


Hyderabad: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆబుదాబిలో నిర్వహిస్తున్న గ్లోబల్ కన్వెన్షన్ 2024 సెప్టెంబర్ 15 కొరకు ఎన్నో ఏర్పాట్లు చేయబడుచున్నవి. వ్యామ్ దుబాయ్ నాయకులు, అబుదాబి నాయకులు రేయింబవళ్లు కష్టపడి ఎన్నో రకాలుగా  విచ్చేసిన అతిథులకు ఇబ్బందులు కలగకుండా వసతి గాని భోజనాలు కానీ ఏర్పాట్ల విషయంలో రాజీ పడకుండా ప్రయత్నిస్తున్నారు.


ఇట్టి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక శాఖ మాత్యులు శ్రీ టి జి భరత్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేయడానికి అంగీకరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఛైర్మన్  శ్రీ టీజీ వెంకటేష్ గారు కూడా విచ్చేయుచున్నారు. ఎంతోమంది ప్రముఖ వైశ్యుల ప్రసంగాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో రకాల తీర్మానాల కొరకు ప్రతిరోజు కూడాను ప్రయత్నాలు జరుగుచున్నవి.  కార్యక్రమ నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఎంతో పగడ్బందీగా నిర్వహించడానికి భారతదేశంలోనే ప్రముఖ ఈవెంట్ ప్లానర్ శ్రేయస్ మీడియాను కోరగా వారు అంగీకరించి నిర్వహించడానికి ముందుకు వచ్చి ఎన్నో రకాలుగా వారి క్రియేటివిటీని చూపిస్తున్నారు.


రూపాయలు ఐదు వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎవరైనా సరే  వెంటనే ప్రపంచార్యవైశ్య మహాసభ నాయకులను గాని అంగీకారం పొందిన ఆదికృత ట్రావెల్ ఏజెంట్లతో గానీ సంప్రదించి మీ ప్రయాణాన్ని సిద్ధం చేసుకోగలరు.  ప్రొద్దున 9 గంటలకు ప్రారంభమై సమావేశము రాత్రి 9 గంటల వరకు యదేచ్చగా నిర్వహింపబడుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా అందరూ కూడాను శాయ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు.  హాజరైన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషపడాలని, ఎన్నో జ్ఞాపకాలను తీసుకుని వెళ్లాలని మా ప్రపంచార్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు  ఎందరివో సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.


ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ నాయకులు, జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల నాయకులు, వివిధ జిల్లాల నాయకులు అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  ఏమాత్రం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను మరొకసారి మీడియా కమిటీ చైర్మన్గా మీ అందరిని ప్రార్థిస్తున్నాను. మన వైశ్యులందరినీ ఒకచోట కలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకొనగలరు.


No comments:

Post a Comment