గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం
:గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. అక్కడి ఖనాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వ్యాపార సముదాలను కూల్చివేశారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో అక్రమ నిర్మాణాలపై (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ) హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. అక్కడి ఖనాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాలు నిర్మించడంతో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేత సమయంలో అధికారులు, యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగాయి.అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామని ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది.
No comments:
Post a Comment