Monday, 26 August 2024

ఏసీబీ వలలో సరూర్ నగర్ విద్యుత్ డీఈ రామ్మోహన్ రావు

ఏసీబీ వలలో సరూర్ నగర్ విద్యుత్ డీఈ రామ్మోహన్ రావు

ప్రస్తుతం ఉన్న చోటు నుంచి మరో చోటుకు ఎలక్ట్రిక్ లైన్

 ఎల్బీనగర్ : ప్రస్తుతం ఉన్న చోటు నుంచి మరో చోటుకు ఎలక్ట్రిక్ లైన్ మార్చి ట్రాన్స్ ఫార్మర్ అమర్చడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా గురువారం ఏసీబీ అధికారులు రైడ్ చేసి సంబంధిత అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన గురువారం సరూర్ నగర్ విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం లో ఒక వ్యక్తి తన రెండెకరాలలో స్థిరాస్తి వ్యాపారానికి అనుమతులు తీసుకున్నాడు.

ఇందులో భాగంగా రెండు ఎకరాల్లో ఉన్న విద్యుత్ 33, 11, కెవి లైన్ లను వెంచర్ నుండి కాకుండా పక్క నుండి అమర్చాలని, దాంతో పాటు ఒక ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని సరూర్ నగర్ విద్యుత్ ఆపరేషన్ డివిజనల్ కార్యాలయంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ తో మాట్లాడి అతని ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ డిఈ రామ్మోహన్ రావు ను పై రెండు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరగా అందుకు డీఈ రూ. 18 వేలు లంచం డిమాండ్ చేశారు. సదరు వెంచర్ యజమాని లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తన బృందంతో కలిసి గురువారం డీఈ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment