Monday, 26 August 2024

బుల్లెట్లు కురిపించండి..కత్తులతో దాడి చేయండి, కానీ - అక్బర్..!

 

బుల్లెట్లు కురిపించండి..కత్తులతో దాడి చేయండి, కానీ - అక్బర్..!     హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా హైడ్రా కూల్చివేతల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలువురు హైడ్రా నిర్ణయాలక మద్దతు ఇస్తుండగా.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం అధినేత అసద్ హైడ్రా కూల్చివేతల పైన స్పందించారు. ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఇదే అంవం పైన స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కూల్చివేతలు మాత్రం వద్దని కోరారు.                                          అక్బర్ వ్యాఖ్యలు

హైడ్రాపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశం పైన అక్బర్ స్పందించారు. కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. ఆ స్కూల్ కూల్చకండి.పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించా. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని వాపోయారు.                                                       కూల్చకండి                                             అంటూదీనికి కొనసాగింపుగా గతంలో నాపై కాల్పులు జరిగాయని గుర్తు చేసారు. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండన్నారు .కత్తులతో దాడి చేయండంటూ చెప్పుకొచ్చారు. పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండంటూ అక్బర్ ఎమోషనల్ అయ్యారు. పేద విద్యార్థుల ఆ పాఠశాల వరం లాంటిదని చెప్పారు. కొందరు కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వైరంతో తాము నిర్మించిన స్కూల్ కూల్చాలని కోరడం సరికాదు. వేలాది మంది విద్యాబుద్దులు నేర్చుకునే స్కూల్ నేలమట్టం అయితే వారి బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని అభిప్రాయ పడ్డారు.  ఎంఐఎం స్పందనతో.                                 కావాలంటే తనను టార్గెట్ చేసుకోమని అక్బర్ పేర్కొన్నారు. తాజాగా హైడ్రా కూల్చివేతల పైన స్పందించిన బీజేపీ నేత మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ - ఎంఐఎం బంధం గురించి ప్రస్తావించారు. పాతబస్తీలో చెరువులు కబ్జాకు గురయ్యాయని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి గుర్తుచేశారు. ఆ కబ్జాలు తొలగించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని అడిగారు. ఓవైసీ కాలేజీని కూలగొడతారా అని మహేశ్వర రెడ్డి ఛాలెంజ్ చేశారు. దీనికి స్పందనగా అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేసారు.

No comments:

Post a Comment