Sunday, 18 August 2024

రక్షాబంధన్ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్..


 రక్షాబంధన్ రోజు ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్.. 

              ప్రయాణికులను గమ్యం చేర్చడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రయాణికులను అందుకుంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోశారు. వారం క్రితం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తోన్న ఓ ప్రయాణికుడికి ఫిట్స్ రావడంతో బస్సు డ్రైవర్ సదరు ప్రయాణికుడిని బస్సులోనే ఆస్పత్రికి తరలించి మానత్వం చాటారు. తాజాగా ఓ మహిళ కండక్టర్ బస్సులోనే గర్భిణీకి ప్రసవం చేశారు. దీంతో మహిళ కండక్టర్ పై ప్రయాణికులతో పాటు అధికారులు ప్రశంసలు కురిస్తున్నారు. రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు . "ఓ మహిళ కండక్టర్ తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు" అని పోస్ట్ చేశారు. టీటీడీ ఛైర్మన్, నామినేటెడ్ పదవులు ఖరారు - అనూహ్య ఎంపిక..!! గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణీ రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి ప్రవసం చేశారు. మహిళ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. రక్షాబంధన్‌ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతిని ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయమని సజ్జనార్ అన్నారు.

No comments:

Post a Comment