కాంగ్రెస్ మెడకు వాల్మీకి ఉచ్చు.. వీ6 బిజినెస్ సంస్థ యజమాని ఎవరు?:
కేటీఆర్ వాల్మీకి స్కాంలో సిట్, సీఐడీ, ఈడీ హైదరాబాద్‌లో దాడులు నిర్వహించినా.. ఆ సమాచారం మీడియాలో రాకుండా అడ్డుకున్నదెవరు? రేవంత్‌రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినా.. మరో నాలుగైదు రోజుల్లో అన్ని విషయాలు బయటకొస్తాయి.
KTR | కాంగ్రెస్ మెడకు వాల్మీకి ఉచ్చు.. వీ6 బిజినెస్ సంస్థ యజమాని ఎవరు?: కేటీఆర్
స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరు?.. వాళ్లను రక్షిస్తున్నదెవరు?
హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖాతాలకు కర్ణాటక నుంచి 45 కోట్ల నగదు బదిలీ
నిందితులెవరు?.. ఆ ఖాతాలు ఎవరివి?
లోక్‌సభ ఎన్నికల్లో ఆ డబ్బులే వాడారా?
రాహుల్‌గాంధీ స్పందించాలి
వాల్మీకి స్కాంలో సిట్, సీఐడీ, ఈడీ హైదరాబాద్‌లో దాడులు నిర్వహించినా.. ఆ సమాచారం మీడియాలో రాకుండా అడ్డుకున్నదెవరు? రేవంత్‌రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినా.. మరో నాలుగైదు రోజుల్లో అన్ని విషయాలు బయటకొస్తాయి.
KTR | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో వాల్మీకి సాం తీగలాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ కుంభకోణంలో తెలంగాణకు చెందిన కీలక కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నట్టు ఆధారాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
ఆ సాంలో భారీగా అవినీతి జరిగిందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యే అసెంబ్లీలో అంగీకరించటంతో.. అందులో ఉన్న అందరి పేర్లు బయటకు రావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పార్లమెంట్ ఎన్నిలకు ముందు దాదాపు రూ.180 కోట్ల ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారిమళ్లిందని, ఆ సొమ్ము ఎవరి ఖాతాలోకి బదిలీ అయ్యిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.180 కోట్లలో రూ.45 కోట్లు హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖతాలకు బదిలీ చేశారని, ఆ ఖాతాలు ఎవరివో వెల్లడించాలని నిలదీశారు.
ఈ వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ సూసైడ్ చేసుకోవటం అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. అలాగే వీ6 పేరుతో ఉన్న బిజినెస్ సంస్థకు రూ.4.5 కోట్లు బదిలీ చేసినట్టు వార్తలు వచ్చాయని, ఆ సంస్థ యజమాని ఎవరో చెప్పాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ డబ్బునే వాడినట్టు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.
Ktr
మీడియాను మేనేజ్ చేసిందెవరు?
ఈ స్కాం వ్యవహారంలో సిట్, సీఐడీ, ఈడీ హైదరాబాద్‌లో దాడులు నిర్వహించినా.. ఆ సమాచారం మీడియాలో రాకుండా అడ్డుకున్నదెవరు? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినా.. మరో నాలుగైదు రోజుల్లో అన్ని విషయాలు బయటకొస్తాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు విత్‌డ్రా చేసినట్టు తమకు సమచారం ఉన్నదని, ఆ బార్లు, బంగారం దుకాణాలను నడుపుతున్నదెవరు? వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఏమిటి? అని నిలదీశారు.
రాహుల్ మాట్లాడరెందుకు?
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీశ్ జార్కిహోళీ పేర్కొనటం వెనుక మతలబు ఏమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పెనవేసుకున్న బంధం వాల్మీకి సామేనా అని నిప్పులు చెరిగారు. ఈ సామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు ఆధారాలున్నా ఈడీ ఎందుకు మౌనంగా ఉన్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలను కాపాడుతున్న వ్యక్తులు, శుక్తులు ఏవో బయటకు రావాలని అన్నారు. పార్లమెంట్‌లో అవినీతిపై మాట్లాడే రాహుల్‌గాంధీ.. వాల్మీకి సాంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. సొంత పార్టీ నేతలు అవినీతి చేస్తే మాఫీయేనా? అని విమర్శించారు.
No comments:
Post a Comment