ఐక్యతతోనే చిన్న పత్రికల మనుగడ సమస్యల సాధనకు కృషి టీఎస్ఎండిపిఏ విలీనం యూసుఫ్ బాబు, దాస్ యం నల్గొండ, ప్రతినిధి :ఐక్యతతోనే చిన్న పత్రికల మనుగడ సాధ్యమని తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగిలు అన్నారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో సంఘం గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం అధ్యక్షతన
జరిగిన తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘం లీడర్స్ మీట్ కు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. చిన్న మధ్యతరహా పత్రికల కొత్త ఎంపానల్ మెంట్, అక్రిడి టేషన్, అప్ గ్రేడ్, ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యల సాధనకు సమిష్టి కృషి చేద్దామన్నారు. దిన పత్రికలకు ప్రతి నెల రెగ్యులర్ యాడ్స్ కు తోడు మ్యాగజైన్స్ కూడా వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 2018 తదుపరి దిన పత్రికల అప్ గ్రేడ్ పెండింగ్ ఉందని, ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్క రించేందుకు ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తామన్నారు. తాజాగా ఇచ్చిన హైకోర్ట్ తీర్పు మేరకు ఎబీసీడి క్యాటగిరి విషయమై తదుపరి ప్రత్యామ్నాయ పారామీటర్స్ అందరికి అనువుగా ఉండేలా కృషి చేస్తామన్నారు. నాన్ హౌజింగ్ సొసైటి, చిన్న పత్రికల హౌజింగ్ సొసైటితో ఇళ్ల స్థలాల సమస్యలకు చెక్ పెడతామన్నారు. ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీల సారథ్యంలో ఆయా సమస్యల సాధనకు సమిష్టి కృషి చేస్తామన్నారు. టియూడబ్ల్యూజే - ఐజేయూ అధినేతల సూచనల మేరకు
చిన్న పత్రికల మనుగడకై తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘాన్ని విలీనం చేసేందుకు సమిష్టి నిర్ణయం తీసుకున్నా మన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సమిష్టి పోరుకు సిద్దమన్నారు. తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ మాట్లాడుతూ చిన్న పత్రికల సమస్యల సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తామన్నారు. అనంతరం సంఘ పెద్దలకు శాలువాలతో ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహమ్మద్ అలీ, కలకొండ రామకృష్ణ, కొమరాజు శ్రీనివాసులు, కోటగిరి చంద్ర శేఖర్, చాకిరేవు వెంకటయ్య, సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండి మక్సుద్, పేర్ల వెంకటయ్య , కోటగిరి రామకృష్ణ, సోమవరపు యాదయ్య, భూపతి రాజు, భూపతి లక్ష్మీనారాయణ, ఎండి ఆసిఫ్ అలీ, వీరెల్లి సతీష్ , వీరెల్లి రమణ, ఎండి. అఫ్జల్ ఖాన్, తిరుమణి శ్రీనివాస్, ప్రజాలహరి శ్రీనివాస్, ఫోటో నాగేశ్వరరావు, షౌకత్ అలీ, గఫూర్, షరీఫ్ బాబు, సయ్యద్ పాష, జెల్లా నాగరాజు, ఇమ్మడి సందీప్ యాదా ప్రవీణ్, ఎఎన్ చారి, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment