Friday, 16 August 2024

ప్రొ.కోదండరామ్ కు కీలక పదవి - ఢిల్లీ తాజా నిర్ణయం..!!

                                       


ప్రొ.కోదండరామ్ కు కీలక పదవి - ఢిల్లీ తాజా నిర్ణయం..!!

 ఎట్టకేలకు ప్రొఫెసర్ కోదండరామ్ నిరీక్షణ ఫలించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లు శాసనమండలిలో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో వీరిద్దరికీ లైన్ క్లియర్ అయింది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీగా నియామకం పూర్తి కావటంతో ఇప్పుడు కోదండరామ్ కు కాంగ్రెస్ నాయకత్వం మరో బంపరాఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే దీని పైన అధికారిక నిర్ణయం జరగనుంది. ఎమ్మెల్సీగా ప్రమాణం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఎట్టకేలకు శాసనమండలి సభ్యుడయ్యారు. గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ లతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలుగా బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఛైర్మన్ గా కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో కొనసాగారు. పలు నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమ వేడిని పెంచారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి సర్కార్ లో వైసీపీకి తొలి విజయం..! అక్కడ మారనున్న లెక్క..! కాంగ్రెస్ నిర్ణయం కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో కోదండరామ్ కు ప్రాధాన్యత దక్కలేదు. అలాంటి సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ కేసీఆర్ కు వ్యతిరేకంగా గళమెత్తారు. తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని స్థాపించారు. ఆ పార్టీని కూడా ప్రజలు ఆదరించలేదు. 2023 ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ఇచ్చారు. తన పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చిన ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తామని పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే గవర్నర్ కోటాలో ఆయన పేరును సిఫార్సు చేసారు. మంత్రిగా ఛాన్స్ బీఆర్ఎస్ నేతలు న్యాయస్థానం ఆశ్రయించటంతో ఎమ్మెల్సీగా నియామకం ఆలస్యం అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయటంతో కోదండరామ్ చట్టసభల్లోకి అడుగు పెడుతున్నారు. ఇక, కాంగ్రెస్ ఎన్నికల్లో సహకరించిన కోదండరామ్ కు తగిన గుర్తింపు ఇవ్వాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్న రాష్ట్ర మంత్రివర్గం విస్తరణకు సిద్దమవుతోంది. ప్రొఫెసర్ కోదండరామ్ కు మంత్రిగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని పైన ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో అధికారికంగా స్పస్టత రానుంది.

No comments:

Post a Comment