Thursday, 1 August 2024

వేములవాడ సబ్ రిజిస్టర్ బదిలీ


 వేములవాడ సబ్ రిజిస్టర్ బదిలీ

రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో సబ్ రిజిస్టర్‌లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.వేములవాడ: రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో సబ్ రిజిస్టర్‌లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేములవాడ సబ్ రిజిస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సి.హెచ్ సురేందర్ బాబును ఎల్లారెడ్డి సబ్ రిజిస్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆయన స్థానంలో కొత్త వారిని ఎవరిని నియమించక పోవడం పట్ల స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది.

ఆది నుండి ఆరోపణలే

వాస్తవానికి అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో పోలిస్తే వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మొదటి నుండి హాట్ టాఫిక్ గానే ఉంటుంది. ఇక్కడ సబ్ రిజిష్టర్‌గా విధులు నిర్వర్తించే వారు ఎవరైనా సరే భారీ మొత్తంలో ఆస్తులు కుడబెట్టుకుట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన అందరి అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో వీరి పని తీరుపై ఉన్నతాధికారులతో పాటు ఏసీబీ అధికారుల వరకు పిర్యాదులు వెళ్లాయి అంటేనే అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో...

ఆంతర్యం ఏంటో..?

ఇక ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వేములవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి నూతన సబ్ రిజిస్టర్‌గా ఎవరు వస్తారనేదానిపై చర్చ జరుగుతున్న తరుణంలో మరో కొత్త చర్చ మొదలైంది. రోజుకు సుమారు 50 నుంచి 100 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగే కార్యాలయంలో ఇప్పటికే కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీల్లో భాగంగా నూతన సబ్ రిజిస్టర్‌ను నియమించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏదో రాజకీయ కోణం దాగి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం స్పందించి వేములవాడ కు వెంటనే నూతన సబ్ రిజిష్టర్‌ను కేటాయించి కార్యాలయంలో పనులన్నీ సక్రమంగా జరిపించాలని ప్రజలతో పాటు డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

No comments:

Post a Comment