Monday, 26 August 2024

హుస్సేన్ సాగర్ చుట్టూ ఆక్రమణలను తొలగించాలని హైడ్రాకు ఫిర్యాదు..!

                        హుస్సేన్ సాగర్ చుట్టూ ఆక్రమణలను తొలగించాలని హైడ్రాకు ఫిర్యాదు..!



                 హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ సామాన్యుల నుంచే కాదు.. ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్మించిన వ్యాపార సంస్థల నిర్మాణాలను తొలగించేలా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా)ను ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో కన్నుమూసిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు బఫర్ జోన్‌లో అనుమతిచ్చిన కట్టడాలను తొలగించాలని పేర్కొన్నారు. ఖైరతాబాద్ దివంగత ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి గతంలో ఇదే అంశంపై పోరాటం చేశారని గుర్తు చేశారు. జలవనరుల పరిధిలో అక్రమ నిర్మాణాల వల్ల ఆయా వనరులపై ఆధారపడిన రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వివరించారు. ఈ రూట్‌లో వందే భారత్‌కు పచ్చజెండా ఊపిన ఏలూరు ఎంపీ హైదరాబాద్ పాతబస్తీలో అమ్మవారి ఆలయం ధ్వంసం ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికార పరిధిని రాష్ట్ర స్థాయికి విస్తరించాలని కోరారు. చెరువులు సహా అన్ని నీటి వనరుల చుట్టూ ఉన్న బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లను ఆదేశించాలన్నారు. కాగా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పరిధిలో ఆక్రమణకు గురైన 43.94 ఎకరాల భూమిని రక్షించినట్లు హైడ్రా పేర్కొంది. నగరవ్యాప్తంగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలు సరైనవేనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కానీ ఆక్రమిత భూములపై​​స్థలాలు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఎంటాని ప్రశ్నించారు. ఎఫ్‌టిఎల్ లేదా బఫర్ జోన్‌లోని చాలా ప్రాపర్టీలను సామాన్య ప్రజలు కొనుగోలు చేశారని చెప్పారు. బిల్డర్ల నుంచి బాధితులకు హైడ్రా డబ్బులు చెల్లించే విధంగా చేస్తుందా అని ప్రశ్నించారు. ఈ ఆక్రమించిన భూమి అని తెలిసి అనుమతులు మంజూరు చేసిన నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ లేదా హెచ్‌ఎండీఏ శాఖల అధికారులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని కృష్ణారావు ప్రశ్నించారు.

No comments:

Post a Comment