Monday, 26 August 2024

విజయవాడలో ఖైరతాబాద్ తరహా భారీ గణపతి.. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా..

 

విజయవాడలో ఖైరతాబాద్ తరహా భారీ గణపతి.. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా..

ఈసారి వినాయక చవితికి విజయవాడ మెరిసిపోనుంది. తెలుగు రాష్ట్రాలు విజయవాడ వైపు చూసేలా భారీ గణనాథుడు రెడీ అవుతున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..    చాలా ఏళ్ల తర్వాత విజయవాడలో ఖైరతాబాద్ తరహా భారీ గణనాథుడు సిద్దమవుతున్నాడు. ఒకప్పుడు ఖైరతాబాద్‌తో పాటు విజయవాడలోనూ భారీ గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చేవాడు. కానీ కొన్నేళ్ల క్రితం రాజకీయ గొడవలతో దీనికి బ్రేక్ పడింది. అయితే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు 72 అడుగుల భారీ గణనాథుడు ఈ వినాయక చవితికి సిద్ధమవుతున్నాడు. ఇక డూండీ సేవాసమితి ఆధ్వర్యంలో మళ్లీ పునర్ వైభవం తీసుకొస్తూ… విజయవాడ భవానిపురం సితార సెంటర్ గ్రౌండ్లో ఈ గణేష్‌ని రెడీ చేస్తున్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సిద్ధమైన మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. 13 టన్నులకు పైగా ఐరెన్, 9 తన్నులకు పైగా బంక మట్టి, బాంబే మట్టి, 2 ట్రాక్టర్ల ఇసుకతో ఈ గణేషుడిని సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా… ఖైరతాబాద్ గణపతిని తయారు చేసిన కళాకారుల బృందమే ఈ విజయవాడ గణేష్‌ని కూడా తయారు చేస్తోంది. దీని తయారీకి కమిటీ దాదాపు రెండు కోట్లు ఖర్చు చేస్తోంది.

No comments:

Post a Comment