నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం విద్యా సంబంధమైన విషయాలపై దృష్టి సారించాలని విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతి, రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ అన్నారు.
బుధవారం ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన యూనివర్సిటీ అధ్యాపక బృందంతో మాట్లాడారు. అవసరాన్ని బట్టి సిలబస్, కరికులాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. విద్యా విషయాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. యూనివర్సిటీలో అవసరమైనంత మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ ద్వారా నియామకం చేసే విషయమై ప్రతిపాదనలు పంపించాలని, ఈ విషయము రాష్ట్ర స్థాయిలో ఆలోచిస్తామని తెలిపారు. అలాగే యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రతిపాదనలను పంపించాలని చెప్పారు. ఆయా కోర్సులలో ప్రవేశాలను పెంచే విషయం సైతం యూనివర్సిటీ యాజమాన్యం దృష్టి సారించాలన్నారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడారు
యూనివర్సిటీ ఓఎస్డి డాక్టర్ అంజిరెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ అల్వాల రవి, అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీవో రవి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్ రెడ్డి,ఐ క్యూ ఏ సి డైరెక్టర్ రమేష్ , డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఆకుల రవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు
అనంతరం ఆయన విశ్వ విద్యాలయ ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన తీజ్ పండుగ ఉత్సవాలలో పాల్గొన్నారు
No comments:
Post a Comment