నీకు దమ్ముంటే నువ్వే వచ్చి బీఆరెస్ పార్టీ ఆఫీస్ మీద చేయి వేయాలనిమంత్రి వెంకట్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సవాల్
నేను అక్కడే ఉండి ఎదుర్కోంటాను కూల్చమని అధికారులను వేధించడం ఎందుకని సూటి ప్రశ్న
నేను చేసిన అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొడుతు ఫోజులంటూ ఎద్దేవా
హైదరాబాద్ : నల్లగొండ బీఆరెస్ పార్టీ ఆఫీస్‌ను కూల్చాలంటూ అధికారులను వేధించడం కాదని, నీకు దమ్ముంటే నువ్వే వచ్చి బీఆరెస్ పార్టీ ఆఫీస్ మీద చేయి వేయాలని, నేను అక్కడే ఉంటానని ఎట్లా కూలగొడుతావో ఏ విధంగా ఎదుర్కోవాలో నేను చూస్తానని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సహా ఏ పార్టీ ఆఫీస్ జోలికి వెళ్లలేదన్నారు. నల్లగొండ అభివృద్ధికి నిధులు తేలేని మంత్రి వెంకట్‌రెడ్డి బీఆరెస్ పార్టీ కార్యాలయాన్ని చూసి ఓర్వలేక కూల్చడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడని దుయ్యబట్టారు.
కూలుస్తా కూలుస్తా అన్న గొప్పోల్లే పావురాల గుట్టలో పావురమై పోయినారని, నీకూ అదే గతి పడుతుందన్నారు. నిబంధనలు, అనుమతుల ప్రకారమే నల్గొండలో బీఆరెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం జరిగిందని, అనుమతుల గూర్చి మాట్లాడితే హైద్రాబాద్ లో గాంధీభవన్ తో సహా…తెలంగాణలో అన్ని పార్టీల కార్యాలయాలు కూల్చేయాల్సిందేనన్నారు. ఎక్కడా ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవన్న సంగతి అందరికి తేలిసిందేనన్నారు. అయినా ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా పార్టీ కార్యాలయాలను ఏ జిల్లాలోనూ కూల్చివేసిన చరిత్ర లేదన్నారు. ఏవరి పార్టీ ఆఫీస్ ఆ పార్టీ వారికి దేవాలయం వంటిదన్నారు. అయినా మేము పర్మిషన్ కోసం గతంలోనే దరఖాస్తు చేశామని, ఆ ఫైళ్లను వెంకట్‌రెడ్డి మాయం చేయించారని ఆరోపించారు.
బీఆరెస్ ప్రభుత్వంలో కేబినెట్‌లో తీర్మానం చేసి, సీసీఎల్ నుంచి అధికారికంగా 1 ఎకరం పార్టీ ఆఫీస్‌కు కేటాయించడం జరిగిందన్నారు. తర్వాతా మేం బీఆరెస్ కార్యాలయం నిర్మాణం అనుమతి కోసం మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అప్పటి మున్సిపాల్టీ కమిషనర్ పట్టణంలోని ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవంటూ దాటవేశారన్నారు. అయినప్పటికి మేం కలెక్టర్‌ను కూడా అనుమతి కోరడం జరిగిందన్నారు. అనుమతుల జాప్యంపై పలుమార్లు కమిషనర్‌ను, కలెక్టర్లను సంప్రదించామన్నారు. ఆనాడు అధికార పార్టీగా ఉన్న బీఆరెస్‌కు పర్మిషన్లు ఎందుకన్న రీతిలో అధికారులు కూడా అనుమతిపై నిర్లక్ష్యం చూపారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా టీఎస్ బీ పాస్‌లో సెక్షన్ 46 మేరకు 33శాతం ఫెనాల్టీ కింద కూడా చట్టపర అనుమతి కోసం నెలన్నర కింద దరఖాస్తు చేసుకున్నామన్నారు.
నుడా చట్టం మేరకు అనుమతినివ్వాలని కోరామన్నారు. 15 రోజులలో నిబంధనల మేరకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉండగా..మంత్రి వెంకట్‌రెడ్డి కలెక్టర్, కమిషన్లపై ఒత్తిడి తెచ్చి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. మళ్లీ ఇవ్వాళ మంత్రి వెంకట్‌రెడ్డి ఈనెల 11న బీఆరెస్ ఆఫీస్ కూల్చమని చెప్పి అధికారులను ఒత్తిడి చేస్తున్నాడన్నారు. దీనిపై చట్టపరంగా పోరాడుతామన్నారు. బీఆరెస్ ఆఫీస్ అక్రమ నిర్మాణమంటున్న మంత్రి వెంకట్‌రెడ్డి ముందుగా ఆయన అనుచరులు చర్లపల్లిలో ఎఫ్‌టీఎల్ ల్యాండ్‌ను కబ్జా చేసి వెంచర్లు, విల్లాలు నిర్మించుకున్నారని, అనేక ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడ్డారని వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేను చేసిన పనులకు సిగ్గు లేకుండా కొబ్బరి కాయలు కొడుతున్నాడు
మంత్రిగా వెంకట్‌రెడ్డి కొత్తగా నల్లగొండ అభివృద్ధికి నిధులు తేకపోగా నేను చేసిన అభివృద్ధి పనులకు సిగ్గులేకుండా కొబ్బరికాయలు కొడుతు ఫోటోలకు ఫోజులిస్తున్నాడని భూపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తాను శాసనసభ్యుని గా 1350 కోట్లతో.. చేపట్టిన పనులకే తను శిలాఫలకాల వేస్తూ, ప్రారంభోత్సవాలు చేస్తున్న మంత్రి వెంకట్‌రెడ్డి ఈ ఎనిమిది నెలలు నల్లగొండకు తెచ్చింది ఏమీ లేదని… చేతనయితేమంత్రిగా 2వేల కోట్ల నిధులు తెచ్చి నల్లగొండ అభివృద్ధి చేయాలని సవాల్ చేశారు. నేను ఎమ్మెల్యేగా కట్టించిన ఐటీ హబ్‌కు తాళం వేసి 2వేల మంది నిరుద్యోగులకు మేలు జరగకుండా నిరుపయోగం చేశాడని, ఆర్‌ఆండ్‌బీ గెస్ట్‌హౌజ్ నత్తనకడ నడుస్తుందని, 90కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన కళాభారతిని, గొల్లగూడెం సుభాష్‌చంద్రబోస్ రోడ్డు, ఐబీ ఆఫీస్ నుంచి డీఈవో ఆఫీస్ రోడ్ల నిర్మాణం పనులు అక్కడే ఆగిపోయిందని, డివైడర్లలో మొక్కలను చంపేస్తున్నాడని, కొత్తగా మొక్కలు పెట్టడం లేదని, ఎన్‌జీ కళాశాల భవనం నిర్మాణం ఆగిపోయిందని ఆరోపించారు.
216కోట్లతో నేను మంజూరీ చేయించిన యూజీడీ పైప్‌లైన్ల పనులను టెండర్ల పంచాయతీతో ఆగిపోయిందని, 56కోట్ల పైప్‌లైన్లన టెండర్లు వేయించలేక వదిలేశారని, పానగల్ రిజర్వాయర్ సుందరీకరణ, వల్లభరావు చెరువు అభివృద్ధి, కళాభారతీ నిర్మాణాలకు మంజూరీ చేయించిన 234కోట్ల రూపాయ నిధులను రద్ధు చేయించాడని, ట్రాఫిక్ సిగ్నల్, లైటింగ్ సిస్టమ్ సైతం నా హయంలోనే మొదలు పెట్టించానని, మంత్రిగా దానికి కొబ్బరికాయలు కొట్టడం సిగ్గుచేటన్నారు. విలీన గ్రామాలకు ప్రతి వార్డుకు కోటి నుంచి రెండుకోట్లు తెస్తే సీసీ రోడ్లు కూడా వేయించడం లేదన్నారు. రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ చేయించలేదని, జిల్లా మంత్రిగా ఏం పని చేస్తున్నావని, పాలన పాలన చేత కాక కోడిగుడ్డు మీద ఈకలు లెక్కపెడుతున్న కోమటిరెడ్డి నీ వైఖరి మార్చుకో అని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment