Saturday, 31 August 2024

*పూలతో లక్ష్మి దేవి సహస్ర నామాలు కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*





                                   *పూలతో లక్ష్మి దేవి సహస్ర నామాలు కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల*

కొత్త పేట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలతో లక్ష్మి సహస్ర నామాలు సామూహిక శ్రీ దేవి కడ్గమల సొత్ర పారాయణం మంత్ర పుష్ప నీరాజనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ లక్ష్మి దేవి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మంజుల రాజు, రామ్ నారాయణ, పుర్షో త్తం గుప్త ,Neela sridher, Ramanaiah, Lokesh Guptha,భునన గిరి శ్రీనివాస్ మరియు వడ్డేపల్లి అంజయ్య స్వామి ,రాజు తదితరులు పాల్గొన్నారు.
Todas las reacc

Traffic Challan: ఇక తప్పించుకోలేరు.. మీ ఫోన్‌కే రానున్న ట్రాఫిక్ చలాన్లు..

 



Traffic Challan: ఇక తప్పించుకోలేరు.. మీ ఫోన్‌కే రానున్న ట్రాఫిక్ చలాన్లు..

మీరు ఎప్పుడైతే ట్రాఫిక్ వయోలేషన్ కు పాల్పడతారో వెంటనే మీ ఫోన్ కి మెసేజ్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలో ఓ నోటిఫికేషన్ వచ్చే కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం చెల్లింపులు చేసినంత సులువుగా, సౌకర్యవంతంగా ట్రాఫిక్ చలాన్ చెల్లించే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది.

ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఎప్పుటైనా ట్రాఫిక్ పోలీసులు మన బండిని ఆపినప్పుడే కదా అవి మనకు గుర్తొచ్చేవి. చాలా మందికి అసలు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నట్లు కూడా తెలీదు. ఎప్పుడో ఏదో ఒక సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడమో, సిటీ లిమిట్స్ లో ఓవర్ స్పీడ్లో వెళ్లడమో, పోలీసుల తనిఖీలకు సహకరించకపోవడమో, హెల్మెట్ లేకుండా టూవీలర్ నడపడం వంటి వాటి వల్ల మీకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఫైన్ చెల్లించకుండానే చాలా మంది ఏళ్లు గడిపేస్తూ ఉంటారు. అయితే ఇకపై ఆ విధంగా కాలం గడిపేయడం కుదరకపోవచ్చు. మీరు ఎప్పుడైతే ట్రాఫిక్ వయోలేషన్ కు పాల్పడతారో వెంటనే మీ ఫోన్ కి మెసేజ్ రూపంలో లేదా వాట్సాప్ మెసేజ్ రూపంలో ఓ నోటిఫికేషన్ వచ్చే కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం చెల్లింపులు చేసినంత సులువుగా, సౌకర్యవంతంగా ట్రాఫిక్ చలాన్ చెల్లించే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్‌లకు వచ్చే టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ కి ఆటోమేటిక్‌గా ఈ ట్రాఫిక్ చలాన్ వచ్చేస్తుంది. ఇది ఉల్లంఘనతో దాని కోసం విధించిన జరిమానా గురించి కూడా తెలియజేస్తుంది. ఈ వ్యవస్థను ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని రవాణా శాఖ యోచిస్తోంది.

ఆన్ లైన్ పేమెంట్లు..

రవాణా శాఖ చెల్లింపుల ప్రక్రియను సరళీకృతం చేసింది. అందుకోసం నిబంధనలు ఉల్లంఘించిన వారు ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చింది. ట్రాఫిక్ చలాన్ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశం ద్వారా పంపిస్తారు. ఇది ఆన్‌లైన్ చెల్లింపు కోసం లింక్‌ను కలిగి ఉంటుంది. లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. వాటిల్లో ఏదో ఒక గేట్ వే ద్వారా లావాదేవీని పూర్తి చేయొచ్చు.

నోటిఫికేషన్..

యూపీఐ యాప్ ద్వారా చలాన్ చెల్లింపు పూర్తయిన తర్వాత ఒకవేళ కొత్త చలాన్ రూపొందితే ప్రతిసారీ పుష్ నోటిఫికేషన్ మీ ఫోన్‌కి వస్తుంది. ఆ తర్వాత అవి చర్య తీసుకునే ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది. చాలా మంది ప్రజలు ఆన్‌లైన్‌లో జరిమానాలు చెల్లించడాన్ని విస్మరించడం లేదా తమ వద్ద జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలియకపోవటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ కొత్త వ్యవస్థతో ఇది ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. ప్రస్తుతం వాహన యజమానులు జరిమానాలు చెల్లించేందుకు రవాణా శాఖ ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలో, చాలా మంది పెండింగ్‌లో ఉన్న జరిమానాలు లేదా చలాన్‌ల కోసం ఎటువంటి ఎస్ఎంఎస్ నోటిఫికేషన్‌ను స్వీకరించరు. అయితే, కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ సమస్య పరిష్కారమవుతుంది.

HYDRA: హైడ్రా టార్గెట్ ఏంటి? పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంటోంది..?




 HYDRA: హైడ్రా టార్గెట్ ఏంటి? పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంటోంది..?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. హైడ్రా అంటే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది.

HYDRA: హైడ్రా టార్గెట్ ఏంటి? పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంటోంది..?

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి | ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోధ్యన్యత్క్షత్రియస్య న విద్యతే ||

“ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక యోధుడికి పోరాడడం కంటే మెరుగైన ప్రత్యామ్నాయం లేదు” అని భగవద్గీత శ్లోకంలోని భావం. “శ్రీకృష్ణుడి బోధనలను అనుసరించే ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తున్నాం” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు హితోపదేశం చేశారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం అంటూ గర్జించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది అనేది ఎన్నో అనుభవాలు చాటుతూనే ఉన్నాయి. ఇటీవల చెన్నై, వయనాడ్‌లో అలాంటి పరిస్థితులను చూశాం. ఏడాది క్రితం హిమాచల్‌ ప్రదేశ్‌లో నాలుగేళ్ల క్రితం చార్‌దామ్‌లో ప్రకృతి విరుచుకుపడితే ఎంతటి విధ్వంసం ఉంటుందో ఊహకందని ఆ విలయం కళ్లముందు కదలాడుతూనే ఉంది. భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది.

“నీవు ప్రకృతితో ఆడుకుంటే.. ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది” అని అంటాడు పర్యావరణ శాస్త్రవేత్త. అందుకే భవిష్యత్‌ తరాల అవసరాలకు అనుగుణంగా పూర్వీకులు ప్రసాదించిన చెరువులు, కుంటల పరిరక్షణకు తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పూనుకోవడం అభినందించదగ్గ పరిణామం. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేయడం, దానికి ఐపీఎస్‌ ఆఫీసర్‌ రంగనాథ్‌ను ఛైర్మన్‌గా నియమించడమే ఓ విప్లవాత్మకం. “అక్రమ నిర్మాణాలను అసలు వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా అసలు వెనక్కి తగ్గదే లేదు. సన్నిహితులైనా, బంధువులైనా డోంట్‌ కేర్‌. పార్టీలకతీతంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతాయి” అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు చాలు ఆయన ఎంత క్లియర్‌గా ఉన్నారో. అంతేకాదు.. ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత పల్లంరాజు నిర్మాణాల్నే మొదట కూల్చివేయడం హైడ్రా చిత్తశుద్దికి అద్దం పడుతుంది.

స్వపక్షమైనా..విపక్షమైనా..ప్రజాసంపదను సంరక్షించడం కోసం ఎందాకైనా వెళ్తాను అన్నది రేవంత్ రెడ్డి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. విమర్శలొచ్చినా.. ప్రశంసలొచ్చినా హైడ్రా దూకుడు మాత్రం తగ్గేదేలే అన్న మెస్సేజ్ చాలా బలంగా తీసుకెళ్తున్నారు. వారం పదిరోజులుగా హైడ్రా బుల్డోజర్ కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతోంది. చెరువును చెరబట్టారని తెలిస్తే చాలు కూల్చివేసుడే. ఈరేంజ్‌లో హైడ్రా దూకుడు చూపిస్తుందంటే…ముందుంది అసలు సిసలు పండుగ అన్నట్టుగా ఉంది.

హైడ్రా అంటే ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. హైడ్రా అంటే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడిన హైదరాబాద్‌ మహా నగరం నేడు కాంక్రీట్ జంగిల్‌గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి, నాలాలాను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే కారణమన్నది అందరికీ తెలిసిందే. దీన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్..  హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఔటర్‌ రింగ్ రోడ్డు వరకు హైడ్రాను విస్తరించారు.

                 హైడ్రాకు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తుండగా.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ కమిషర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు నిర్మోహటంగా కూల్చేసే పనిలో పడింది హైడ్రా. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చేశారు. ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయని వెనకడగు వేసేది లేదని చెబుతున్నారు.

ఢిల్లీ టవర్స్ కూల్చివేతే స్ఫూర్తి :

70కోట్ల బడ్జెట్‌తో కట్టిన ఈట్విన్ టవర్స్‌ను కట్టడానికి ముూడేళ్ల సమయం పట్టింది. కానీ కూల్చేందుకు కేవలం 9సెకన్లు మాత్రమే పట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్‌ను కట్టారని ఇంతపెద్ద టవర్స్‌ను కూల్చివేశారు. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ NBC వివరాల ప్రకారం.. గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్‌ కోర్టులోని టవర్‌కు మధ్య దూరం కేవలం 9 మీటర్లు మాత్రమే ఉంది. అంటే కేవలం 7మీటర్లు తేడాతో ఈభవనం నిర్మించారు. అందుకే కూల్చివేశారు.

ఢిల్లీ ట్విన్ టవర్స్‌ విషయంపై ఎమరాల్డ్‌ కోర్టు నివాసులు 2012లో కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా వీటి నిర్మాణం జరిగిందని అలహాబాద్‌ హైకోర్టు 2014లో తీర్పు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టులోనూ భవనాలను నిర్మించిన సూపర్‌టెక్‌ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాల్సిందేనని ఆగస్టు 31, 2021న కోర్టు తీర్పునిచ్చింది. ఈ రెండు టవర్స్‌ కూడా కుతుబ్‌ మినార్‌, ఇండియా గేట్‌ కంటే చాలా ఎత్తులో ఉన్నాయి. కేవలం 7మీటర్ల తేడాతో కట్టిన అంతపెద్ద ట్విన్ టవర్స్‌నే కూల్చివేయగా…చెరువులపై నిర్మాణాలు చేస్తే ఊరుకోవాలా….? కోర్టులు అందుకు సమర్ధిస్తాయా…లేదు కదా. కబ్జాలు చేసి…చెరువులను ఆక్రమించి కట్టేసి..తర్వాత కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్‌లతో కాలయాపన చేయవచ్చు అనుకునేవారికి అతిపెద్ద గుణపాఠం..ఢిల్లీ ట్విన్ టవర్స్.

హైడ్రాకు ప్రజల మద్దతు :

చెరువులు, కుంటల పరిరక్షణకు దిగిన హైడ్రాకు ప్రజల మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఓ పాఠమే. 2014నుంచి నోటీసులిచ్చినా…అక్రమంగా కట్టారని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా నాగార్జున పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం విషయంలో చాలా ఏళ్లుగానే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే కోర్టుల విచారణ కారణంగా ఇంతకాలం నాగార్జునకు ఊరట లభిస్తూ వచ్చింది. హైడ్రా దూకుడు నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ నేలమట్టమయ్యింది. హైడ్రా నిర్ణయం చట్టవిరుద్ధమన్న నాగార్జున.. దీనిపై చట్టబద్ధంగా పోరాడుతానని ప్రకటించారు. అయితే ఆక్రమణలకు పాల్పడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా స్పష్టమైన హెచ్చరికలు పంపింది.  సీఎం రేవంత్ రెడ్డి  చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలపై దృఢనిశ్చయంతో ఉన్నారు. అందుకే ప్రజల నుంచి హైడ్రాకు ఫుల్ సపోర్ట్ వస్తోంది. హైడ్రాకు హ్యాట్సాఫ్ చెబుతూ…గండిపేట వెల్ఫేర్ సొసైటీ సపోర్ట్ వాక్ కూడా నిర్వహించింది. సపోర్ట్ వాక్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ వాక్‌లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనది హైడ్రా మనందరిదీ అనే నినాదాలు చేశారు.

ప్రజల ముందు హైడ్రా రిపోర్ట్‌ :

ఇంతవరకూ 18 చోట్ల చెరువుల్ని ఆనుకుని నిర్మించిన 43 ఎకరాల స్ట్రక్చర్స్ హైడ్రా బుల్డోజర్ల నేలమట్టం చేశాయి. ఒక్క గండిపేట చెరువులోనే 15 ఎకరాల ఆక్రమణలు తొలగించేసింది హైడ్రా. ఇంతవరకూ జరిగిన కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్‌ రిపోర్ట్‌ వచ్చేసింది. ఎన్ని అక్రమ కట్టడాలు నేలకూలాయి.. వాటిని అక్రమంగా కట్టిందెవరు.. వాటిని ఎందుకు కూల్చాల్సి వచ్చింది.. అనే డీటెయిల్స్ అన్నీ జనం ముందుంచింది హైడ్రా. హైడ్రా నివేదిక ప్రకారం 18 ప్రాంతాల్లో ఇప్పటివరకు కూల్చివేతలు జరిపింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌, ప్రో కబడ్డీ యజమాని అనపమకు చెందిన భవనాన్ని కూల్చివేసినట్లు వివరించింది. కావేరి సీడ్స్‌ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్‌రెడ్డి, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్‌ మీర్జా, నందగిరిహిల్స్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మద్దతుదారుడు, చింతల్‌లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్‌ నేత పళ్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాల్ని కూల్చివేసినట్లు తెలిపింది.

కానీ ఇదంతా ట్రైలర్‌ మాత్రమే..ఇకముందుంది అసలు సినిమా అన్న సంకేతాలు పంపుతోంది హైడ్రా. ఇప్పటికే పలు పొలిటికల్ లీడర్ల హౌస్‌లకు, ప్లాట్స్‌కు నోటీసులు కూడా పంపింది. హైదరాబాద్‌ శివారు జోడిమెట్లలోని నాదం చెరువు.. పొలిటికల్‌గా టాప్‌ లేపుతోందిప్పుడు. బఫర్‌ జోన్‌లో అనురాగ్‌ వర్సిటీ నిర్మించారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌పై ఫిర్యాదులందాయి. ఇందుకోసం జోడిమెట్ల నుంచి కాలేజీ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశారని కూడా కంప్లయింట్ ఉంది. నాదెం చెరువు కబ్జాకు గురైందన్న ఆరోపణలపై హైడ్రా ఏం చెయ్యబోతోందన్నదానిపైనా ఆసక్తి రేపుతోంది.

పులిమీద స్వారీ చేస్తున్నారా?

బడా బాబులు ఉండే చిత్రపురి కాలనీపైనా ఫోకస్ పెట్టింది హైడ్రా. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులు పంపారు. జీవో 658కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన 225 విల్లాలపై సీరియస్‌ అయ్యారు. జీ+1 నిర్మాణానికి అనుమతులు తీసుకుని… జీ+2 నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే… కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలంటూ చిత్రపురి సొసైటీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో… మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో టెన్షన్‌ మొదలైంది.మరోవైపు ఇదే దూకుడు సొంత పార్టీ నేతల ఫాంహౌస్‌లపైనా ప్రదర్శిస్తారా అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విపక్షాల విమర్శలకు సమాధానం అన్నట్లు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా హైడ్రా నోటీసులు అందుకోవడం ఆసక్తికరంగా మారింది.

          బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. అవన్నీ చెరువుని కబ్జా చేసి కట్టినవే అన్న వివాదాలు ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా..అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఫార్మ్ హౌజ్ లని కూలగొట్టినా ప్రజలు ఈ లోపాయికారి ఒప్పందం అన్న ప్రచారమూ జరిగే ప్రమాదం ఉంది. సీపీఐ నారాయణ చెబుతున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారా…?

అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యుడు బలి :

ప్రస్తుతం సోషల్ మీడియా రూపంలో భారీగా ఫిర్యాదులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. హైడ్రాపై ప్రజల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. నాయకులు, సెలబ్రిటీల భవనాలు, వేలకోట్లు పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ కు చెందిన వెంచర్లు చాలా వరకు చెరువులను ఆక్రమించి కట్టినవేనన్న ఫిర్యాదులున్నాయి. ఒకే చెరువుగా ఉన్న కాముని చెరువు..రెండుగా చీలింది. మధ్యలో అతిపెద్ద వెంచర్లు వెలిశాయి. ఈవెంచర్‌ వేసింది సిటీలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్ సంస్థ. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మించింది. చెరువులను అడ్డంగా ఆక్రమించుకుని…అపార్ట్‌మెంట్లు కట్టి సామాన్యుల దగ్గర కోట్లు గుంజి తనపని ముగించుకుంది. కానీ హైడ్రా వీటిని కూల్చివేస్తే పరిస్థితి ఏంటి..? అన్న ప్రశ్న తలెత్తుతోందిప్పుడు.

                          కూకట్‌పల్లి కాముని చెరువు బఫర్‌జోన్‌లో వెలిసిన రాఘవేంద్ర కాలనీలో జీరో పర్మిషన్‌తో భారీ భవన నిర్మాణం జరిగాయి. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయాయి. మొదటగా చెరువు బఫర్‌ జోన్‌లో చిన్న చిన్న రేకుల రూములు నిర్మించి స్థలాలను ఆక్రమించారు. తర్వాత పక్కా భవన నిర్మాణాలు చేసుకుని దర్జాగా ఆ ఇంట్లో నివాసముండటం.. మరికొందరు లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం పరిపాటిగా మారింది.

                        మాములుగా కాలనీలు, బస్తీలలో అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా స్థలాలలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆర్కెటెక్చర్‌ను సంప్రదించి భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాను సిద్ధం చేసుకుని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అనుమతి తీసుకొని నిర్మాణ పనులు చేపడతారు. కానీ చాలా ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు.. జీరో పర్మిషన్‌తో భారీ భవన నిర్మాణం జరిగినా జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

నాగార్జున వల్లే కాలేదు.. సామాన్యుల సంగతేంటి ?

        నాగార్జున ఒక సెలెబ్రిటీ. ఒక ఆస్తి పోతే ఆయనకొచ్చిన ఇబ్బిందిలేదు. అదే సామాన్యుడు తెలిసో తెలీకో చెరువు మీద కట్టిన ఇల్లు కొనుక్కుంటే, ఇదే హైడ్రా వాళ్లు అతని మీద పడితే అన్యాయం కాదా అన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు చెరువు మీద ఇల్లు కట్టడం అక్రమం కదా అంటే, ఇక్కడ ఆవేశం కన్నా ఆలోచనతో చూడాల్సిన అంశం ఉందనే చర్చా సాగుతోంది. చెరువు మీద కట్టడం కచ్చితంగా అక్రమమే. అయితే అలా కట్టొచ్చని అనుమతి ఇచ్చిన సంస్థలు ఒకటి కాదు- హెచ్ ఎం డి యే, జీ హెచ్ ఎం సీ, రెవెన్యూ శాఖ, ఇర్రిగేషన్ శాఖ.. ఇలా అనేకముంటాయి. ఈ శాఖలన్నీ అనుమతులిస్తేనే ఎవరన్నా కట్టగలుగుతారు. లంచమిచ్చి దొంగ అనుమతులు తెచ్చుకుని ఉండొచ్చు ..అయితే అన్ని శాఖల్నీ చేతులు తడిపి అనుమతులు తెచ్చేసుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమయింది అనుకున్నా, ప్రభుత్వశాఖ అధికారి సంతకంతో ఉన్న డాక్యుమెంట్ చట్టబద్ధమే కదా ..అన్న అభిప్రాయమూ 

                కొనుక్కునే వారికీ బిల్డర్ అనుమతి పత్రాలు చూపిస్తూ..ఆపత్రాలను బేస్ చేసుకుని బ్యాంక్ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి, అంతా ఓకే అనుకున్నాకే కదా లోన్ ఇస్తారు. మరి అంత పకడ్బందీగా జరిగే విధానాన్ని ఎలా చూడాలి…అన్న చర్చా జరుగుతోంది. ఇవన్నీ ఉన్నా కూడా కబ్జా అని అనిపిస్తే కూలగొట్టేయమని అధికారాలిస్తూ హైడ్రాని ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నవారున్నారు. అలా అడుగుతున్నవారు చెరువు పక్కన కట్టిన అపార్ట్మెంట్లల్లో ఫ్లాట్స్ కొనుక్కుని అందులో ఏళ్ల తరబడి జీవిస్తున్నారు. ప్రభుత్వం వాళ్ల చేత ఆస్తిపన్ను కట్టించుకుంటోంది, కరెంట్ కనెక్షన్ ఇచ్చింది, రోడ్లు వేసింది, మంచి నీటి కనెక్షన్ ఇచ్చి వాటర్ బిల్ కట్టించుకుంటోంది.. ఇప్పుడు సడన్ గా వచ్చి “ఇది అక్రమ కట్టడం.. కూల్చేస్తాం..” అని బుల్డోజర్లు తీసుకొస్తే పరిస్థితి ఏమిటి? ఎవరికి చెప్పుకోవాలి? నాగార్జునకే పని జరగలేదు. సామాన్యుల సంగతేంటి ? అన్న వాదనా వినిపిస్తోంది. చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే.. చెరువుల ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.

వాటిని కూడా కూల్చేస్తారా?

ప్రస్తుతానికి నిర్మాణంలోనే ఉండి ఇంకా ఆక్యుపై చేయని ఫ్లాట్లు, ఎన్-కన్వెన్షన్ లాంటి కమర్షియల్ హాల్, ఏవో కొన్ని ఫార్మ్ హౌజులు తీసేస్తే తీసేయొచ్చు గాక. కానీ ఇదే ఊపుతో చెరువుల చుట్టూ ఉన్న ఇళ్లల్లొ నివాసముంటున్న సామాన్యుల జోలికొస్తే పరిస్థితి ఏంటి…అన్న ప్రశ్నా వినిపిస్తోంది. ఇది నిజంగా పులిమీద స్వారీ లాంటిదే . కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ ఇలాంటి విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. సీఎం హైడ్రా మీద చాలా స్పష్టంగా ఉన్నారు. ఇదే దూకుడు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయన్న సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చేశారు. ఇదే తరహాలో దూకుడుగా చూపిస్తే మణికొండలో చాలా ఇళ్లు ఎగిరిపోయే ప్రమాదం ఉంది. అక్కడా చెరువులపక్కన కట్టినవి వందల్లో ఉన్నాయి. పైగా అక్కడ సినీప్రముఖుల ఇళ్లు అనేకమున్నాయి.

ఇక హైదరాబాద్ మహానగరంలో ఘనకీర్తి గాంచిన మీర్‌ ఆలం చెరువు కూడా కబ్జా కోరల్లో ఉంది. రెండు శతాబ్దాల క్రితం అప్పటి హైదరాబాద్ ప్రధాని మీర్‌అలం చెరువుకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి.. నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నీళ్లు స్వచ్ఛంగా ఉండటంతో… నిజాం నవాబులు సైతం వినియోగించేవారు. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు రోజు రోజుకి కబ్జాలతో కుంచించుకుపోయిది. గతంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా కబ్జా ఆగలేదు. ఆక్రమణకు గురవుతూనే ఉంది. అయితే అలాగే హైడ్రా కూల్చివేతలను ఎంఐఎం తప్పుబడుతోంది. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన గవర్నమెంట్ ఆఫీసులను కూడా కూల్చివేస్తారా అని నిలదీశారు.

ప్రతిపక్షాల రివర్స్‌ ఎటాక్‌:

హైడ్రా కూల్చివేతలన్నీ డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగమన్నది విపక్షాల వాదన. రైతుల ఋణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే హైడ్రాను తెరపైకి తెచ్చారంటోంది బీఆర్ఎస్. కక్షసాధింపుల చర్యలో భాగంగా జరుగుతున్న కూల్చివేతలు తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదంటున్నాయి విపక్ష పార్టీలు. అయితే ఇందులో ఎలాంటి కక్షసాధింపులేదంటోంది కాంగ్రెస్ సర్కార్. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియగా ఉందన్నారు మంత్రి పొన్నం. కూల్చివేతలు జరిగిన ప్రతి సందర్భంలో విమర్శలు, ప్రశంసలు కామనే.

లౌక్‌డౌన్ సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగింది. దాదాపు 40భవనాలు అక్రమంగా కట్టినట్లు జీహెచ్‌ఎంసీ నిర్ధారించి కూల్చివేసింది. అయితే అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాలపై కథనాలు వచ్చినప్పుడల్లా సామాన్యుల భవనాలనే కూలుస్తున్నారు. బడాబాబుల పెద్ద భవనాలను మాత్రం వదిలేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చేవి. ప్రస్తుతం సామాన్యుల అపార్ట్‌మెంట్లే కాదు..బలిసినోళ్ల విల్లాలు, ఫాంహౌస్‌లను కూడా హైడ్రా కూల్చివేస్తోంది.

Hydra Demolition

GO 111 పరిధిలోనూ ఉక్కుపాదం?

రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే కేవలం హైడ్రాతోనే సరిపెట్టేలా కనిపించడంలేదు.  111జీవో…సరిగ్గా ఏడాది క్రితం వరకు తెలంగాణలో ఇదో హాట్ టాపిక్‌. సామాన్యుల నుంచి బడా రియల్టర్ల వరకు దీనిపైనే తీవ్రంగా చ‌ర్చించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రిపుల్ వ‌న్ జీవో ప్లేస్‌లో కొత్తగా 69 జీవోను విడుద‌ల చేసింది. ట్రిపుల్ వ‌న్ జీవో ర‌ద్దు అంటూ ప్రచారం కూడా జరిగింది. ల‌క్షా 30వేల ఎక‌రాల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామ‌ని.. గ్రీన్ సిటీగా డెవ‌ల‌ప్ చేస్తారన్న ప్రచారమూ జరిగింది.

             అయితే ట్రిపుల్ వ‌న్ జీవోను ర‌ద్దు చేయ‌డంపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు. ట్రిపుల్ వ‌న్ జీవోను ర‌ద్దు చేసిన కేసీఆర్‌, కేటీఆర్‌, సోమేష్ కుమార్‌, అర‌వింద్ కుమార్‌ల‌ను.. అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద గుంజ‌కు క‌ట్టేసి.. రాళ్ల‌తో కొట్టాలంటూ ఆవేశంతో ఊగిపోయారు. మరి హైడ్రాతో దూకుడుమీదున్న సీఎం రేవంత్‌ రెడ్డి. . ట్రిపుల్ వ‌న్ జీవో పై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్న ఆసక్తి ప్రజల్లో ఉంది.

విద్యాసంస్థల విషయంలో ఆచితూచిః

                   మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. అలాగే దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజ్ సహా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ కాలేజీలకు నోటీసులిచ్చారు. చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో కాలేజీలో నిర్మించారంటూ అధికారులు నోటీసులందించారు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని.. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 489, 485, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగ్స్‌, షెడ్లు, వెహికిల్ పార్కింగ్‌తో పాటు కాలేజ్ రోడ్లు వేసినట్టు గుర్తించారు అధికారులు. దీంతో కాలేజీలను కూల్చివేస్తారా అన్న చర్చ జోరందుకుంది.

                           విద్యాసంస్థల నిర్మాణాలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని.. అయితే విద్యార్థుల అకాడమిక్ ఇయర్‌ని దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌. ముందుగా నోటీసులు ఇచ్చి.. గడువు ముగిసిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణ ప్రజలకు ఒకలా.. ప్రజాప్రతినిధులకు మరోలా రూల్‌ ఉండదని.. అందర్నీ ఒకేలా చూస్తామన్నారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ కాలేజీలకు నోటీసులివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.

Hyderabad

ఓవైసీ కొత్త వాదన:

పాతబస్తీ బండ్లగూడలోని సలకం చెరువు 70శాతం కబ్జాకు గురైందన్న ఆరోపణలున్నాయి. 1979 నాటి మ్యాప్ ప్రకారం సలకం చెరువులో 70 శాతం కబ్జాకు గురైనట్టు తెలుస్తోంది. 2014కి ముందు చెరువు చుట్టూ ఎఫ్‌టీఎల్‌లో కొన్ని ప్రైవేట్​ కట్టడాలు నిర్మించుకున్నారని స్థానికులు చెబుతున్న మాట. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి వేసిన హైడ్రా అధికారుల నెక్స్ట్ టార్గెట్‌ సలకం చెరువు మధ్యలో నిర్మించిన ఒవైసీ విద్యా సంస్థలేనన్న వార్త బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు హైడ్రా తలొగ్గదని.. కబ్జాలకు పాల్పడిన ఎంతటి వారినైనా వదలబోదని హెచ్చరించారు. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. అవసరమైతే కాల్చేయండి… తన విద్యా సంస్థల జోలికి వస్తే బాగుండదన్న హెచ్చరికలు రాజకీయ దుమారం రేపాయి.

        ఎఫ్‌టిఎల్‌ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ సంస్థల్ని కూడా హైడ్రా కూల్చేస్తుందా అని ప్రశ్నించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. హిమాయత్ సాగర్‌ ఎఫ్‌టిఎల్‌ పరిధిలో సీసీఎంబీ.. హుస్సేన్‌ సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న నెక్లెస్‌ రోడ్‌ను కూడా తొలగిస్తారా అని నిలదీశారు. మరోవైపు సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ క్రమంలో ఆక్రమణలు, కూల్చివేతలపై రంగనాథ్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేవలం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. విద్యాసంస్థల యజమాన్యాలకు సమయం ఇస్తున్నామన్నారు.

ఇన్నాళ్లు ఎంఐఎం పార్టీ చెప్పిందే శాసనంలా ప్రభుత్వాలు వింటూ వచ్చాయి. మరి ఒవైసీ బ్రదర్స్‌ను కాదని విద్యాసంస్థల్ని కూల్చివేసే అవకాశం ఉందా? అసలు విద్యాసంస్థల నిర్మాణం సక్రమమా? అక్రమమా? ఒకవేళ నేతలకు చెందిన విద్యాలయాల భవనాలను హైడ్రా కూల్చివేస్తే మాత్రం ఇకపై ఎవ్వర్ని వదిలే అవకాశం ఉండదనే చర్చ నడుస్తోంది.

మరోవైపు హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైడ్రా దూకుడుతో అక్రమార్కుల్లో లబ్ డబ్ మొదలైంది. కూల్చివేస్తామని నోటీసులు ఇస్తుండటంతో వాళ్లు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు


 

IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, అదనపు బాధ్యతలు

 

IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ డైరెక్టర్‌గా కే సురేంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.

 తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ డైరెక్టర్‌గా కే సురేంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. భూసేకరణ, పునరావాస కమిషనర్‌గా టీ వినయ్‌ కృష్ణారెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చింది. మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయేషా మస్రత్‌ ఖానంను బదిలీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా తఫ్సీర్‌ ఇక్బాల్‌, మైనారిటీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా షేక్‌ యాస్మిన్‌ బాషాకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. మైనారిటీ ఆర్థిక సంస్థ ఎండీగా నిర్మలా కాంతి వెస్లీకి అదనపు బాధ్యతలు ఇవ్వగా.. వక్ఫ్‌ బోర్డ్‌ సీఈవోగా మహ్మద్‌ అసదుల్లా నియామకమయ్యారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా జీ మల్సూర్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పీ శ్రీజను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

156 రకాల మందులపై నిషేధం విధించిన కేంద్రం.. ఎందుకంటే?

 

156 రకాల మందులపై నిషేధం విధించిన కేంద్రం..

ఎందుకంటే?

ఎఫ్‌డీసీ మందులు మానవులకు చాలా ప్రమాదకరమైనవి, అందువల్ల వాటి అమ్మకం, పంపిణీ నియంత్రించడం ముఖ్యమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

: టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ అరెస్ట్.. కారణం ఏమిటంటే?

ఎఫ్‌డీసీ మందులు మానవులకు చాలా ప్రమాదకరమైనవి, అందువల్ల వాటి అమ్మకం, పంపిణీ నియంత్రించడం ముఖ్యమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. 2016లో 344 మందుల పంపిణీ, విక్రయాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ ప్రకారం.. శాస్త్రీయ డేటా లేకుండా రోగులకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది. 2023 సంవత్సరం జూన్ నెలలో 14 ఎఫ్‌డీసీ మందులను నిషేధించింది. తాజాగా 156 మందులపై నిషేధం విధించింది. అరోగ్యానికి ముప్పుతెచ్చేందుకు ఊతమిస్తున్న 34 రకాల మల్టీ విటమిన్ ఔషధాలనుకూడా నిషేధించే యోచనలో కేంద్రం ఉంది. నిషేధించబడిన ఎఫ్‌డీసీలలో మెఫనమిక్‌ యాసిడ్‌, పారా సిటమాల్‌ కాంబినేషన్‌ ఇంజెక్షన్లను సాధారణంగా నొప్పి నివారణకు వినియోగిస్తారు. ఈ కాంబినేషన్‌ మందు వల్ల రోగుల్లో తీవ్రమైన దుష్ఫలితాలు తలెత్తుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

ఎసిక్లోఫెనాక్‌, పారాసిటమాల్‌ కాంబినేషన్‌ చాలా సాధారణంగా వైద్యులు ప్రిస్ర్కైబ్‌ చేస్తుంటారు. ఈ కాంబినేషన్‌పైనా ప్రభుత్వం నిషేధం విధించింది. మొటిమల చికిత్స, ముక్కు దిబ్బడ, చర్మవ్యాదుల చికిత్సల్లో వాడే ఔషధాలు కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే, కేంద్రం తాజా నిర్ణయంతో సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్. ఆల్కెమ్ లేబొరేటరీస్‌తో సహా ప్రధాన ఔషధ కంపెనీలపై నిషేధం ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

 

Friday, 30 August 2024

Inauguration of Swayamvaram website

 Inauguration of Swayamvaram website


and vadhu Vara Parichaya Vedika poster by Vn Diamond* KCGF R Ravichandran, International President, Vn Diamond* KCGF Eirukula Ramakrishna, International Executive Vice President at VCI office, Secunderabad. The program is organised by VC Secunderabad.

Thursday, 29 August 2024

తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. హైదరాబాద్ ఆర్ఎస్ బ్రదర్స్ కళ్లు చెదిరే మొత్తంలో చెక్కులు

 

తిరుమల శ్రీవారికి భారీ

విరాళం.. హైదరాబాద్ ఆర్ఎస్ బ్రదర్స్ కళ్లు చెదిరే మొత్తంలో చెక్కులు

        Tirumala : తిరుమల శ్రీవారికి హైదరాబాద్ ప్రముఖ వ్యాపార సంస్థ భారీగా విరాళం అందించారు. టీటీడీకి ఏకంగా రూ.3.70 కోట్ల భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాద రావు, మాలతి లక్ష్మీకుమారి ఈ విరాళపు చెక్కులను శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అంతకముందు దాతలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.       

   

తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం

ఆర్ఎస్ బ్రదర్స్ రూ.3.7 కోట్లు అందజేత
టీటీడీ ట్రస్టులకు ఈ విరాళాలు ఇచ్చారు.                                  తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఈ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని.. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. టీటీడీ ట్రస్టుల ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ, విద్య, వైద్యానికి చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్ని అందించినట్లు దాతలు తెలిపారు.

అవసరం లేకున్నా కేసులను రెఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం- జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

 సీజనల్ వ్యాధుల పట్ల రానున్న మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి 

@ పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

@ అవసరం లేకున్నా కేసులను రెఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం- జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి 





       సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ,మున్సిపల్ పంచాయతీ అధికారులు రానున్న మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.


        గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, తదితరులతో సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


       జ్వరాల పై ఆయన మాట్లాడుతూ ఏ గ్రామం, ఏ ప్రాంతం నుండి ఎక్కువగా జ్వరాలు వస్తున్న వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ఆశ, అంగన్వాడి తో పాటు, ఏఎన్ఎంలు వారికి కేటాయించిన విధుల సమయంలో గ్రామంలోనే ఉండాలని, ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్వరాలకు సంబంధించి రిజిస్టర్ ను నిర్వహించాలని, జ్వరాలు ఎక్కువగా వచ్చే గ్రామాలు, పట్టణాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని, వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆయా ప్రాథమిక వైద్య ఆరోగ్య  సెంటర్ల లోని పనిచేసే శానిటేషన్ సిబ్బంది ,సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్లు రోగులతో దురుసుగా ప్రవర్తించవద్దని ,ఎవరైనా అలా ప్రవర్తించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు  ఫిర్యాదు అందినట్లయితే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 18004251442 నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా కొన్ని ఆస్పత్రుల నుండి లేదా నేరుగా జిల్లా కేంద్ర ఆస్పత్రికి,  కేసులను రిఫర్ చేస్తున్నారని,   చికిత్స కేసులు, అవసరం ఉన్న  కేసులు మాత్రమే రిఫర్ చేయాలని, ప్రత్యేకించి ఆశ వర్కర్లు ఎట్టి పరిస్థితులలో నేరుగా జిజిహెచ్ కు కేసులు రిఫర్ చేయకూడదని ఆదేశించారు . అనవసరంగా రిఫర్ చేసినట్లయితే వారి జీతం నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వైద్యాధికారులు వారి ప్రాంతాలలో అవసరమైతే మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని ,వచ్చే డిసెంబర్ వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. , వైద్య ఆరోగ్యశాఖ తో పాటు, స్థానిక సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఎవరు  అనధికారికంగా  గైర్హాజరు కావద్దని, విధులలో ఉన్న సమయంలో కష్టపడి పని చేయాలని అన్నారు .రిఫర్ చేసే కేసులకు సంబంధించి తక్షణమే ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నామని, 15 రోజులకు ఒకసారి రిఫరల్ కేసులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.


        స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్ ,ప్రభుత్వ వైద్య కళాశాల హెచ్ ఓ డి స్వరూప, ప్రత్యేక అధికారులు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపర్ ఇంటింటెంట్, ప్రాథమిక వైద్యా ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, ఏరియా ఆసుపత్రి డాక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు 

___________________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Tuesday, 27 August 2024

తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల

                                                తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల


న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరికాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మార్చి 15న కవిత అరెస్టయ్యారు. హైదరాబాద్ కు వచ్చి విచారించిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారని తెలిసిందే. తిహార్ జైలులో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆర్డర్ కాపీ తిహార్ జైలుకు అందిన తరువాత ఫార్మిలిటీస్ పూర్తి చేశారు. కవిత తరఫున కావాల్సిన డాక్యుమెంట్స్ ను జైలు అధికారులకు ఆమె లాయర్ సమర్పించారు. అనంతరం తిహార్ జైలు నుంచి కవితను జైలు అధికారులు విడుదల చేశారు.

              దేశం విడిచి వెళ్లిపోకుండా, చూడటంలో భాగంగా ఆమె పాస్ పోర్ట్ అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి కేసులో రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీ ఇవ్వాలని కోర్టు పేర్కొంది. జైలు నుంచి విడుదలయ్యాక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం షరతులు విధించింది.

             కవిత భర్త, బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలుకు వెళ్లి ఆమెను రిసీవ్ చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన కవిత అటు నుంచి ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కవిత మీడియాతో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కవిత, ఆమె భర్త, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు నేటి రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. బుధవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో కేసు విచారణకు రానుంది. కవిత ఆన్ లైన్ లోనే విచారణకు హాజరవుతారు. విచారణ ప్రక్రియ పూర్తయ్యాక ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దాదాపు 2.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత సహా బీఆర్ఎస్ నేతలు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు.

బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాక్‌కు మరో దెబ్బ.. షాకిచ్చిన ఐసీసీ.. WTC ఫైనల్‌ ఆశలు గల్లంతు!

బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాక్‌కు మరో దెబ్బ.. షాకిచ్చిన ఐసీసీ.. WTC ఫైనల్‌ ఆశలు గల్లంతు!


         : రావల్పిండి టెస్టులో స్లో ఓవర్ రేటు నమోదు చేశారని పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ పాయింట్లలో కోత విధించింది. ఆరు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసిన పాకిస్థాన్ ఖాతా నుంచి ఆరు, నాలుగు ఓవర్లు తక్కువగా బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఖాతా నుంచి నాలుగు పాయింట్లు కోత విధించింది. రిజ్వాన్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన షకిబ్‌ హసన్‌పై కూడా చర్యలు తీసుకుంది.

ప్రధానాంశాలు:

రావల్పిండి టెస్టులో స్లో ఓవర్ రేటు నమోదు

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ జట్లపై ఐసీసీ చర్యలు

డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత విధించిన ఐసీసీ

బంగ్లా చేతిలో ఓడిన పాక్ జట్టుకు మరో దెబ్బ

    అసలే సొంతగడ్డపై పసికూన బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌ ఓడిపోయి నిరాశలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. రావల్పిండి టెస్టులో స్లో ఓవర్‌ రేటు నమోదు చేసిన కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో పాయింట్ల కోత విధించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో గెలిచిన బంగ్లాదేశ్‌పై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంది. ఆ జట్టు కూడా నిర్ణీత సమయంలోగా బౌలింగ్‌ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

           ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు నిర్ణీత సమయంలోగా ఏకంగా ఆరు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (2023-2025)లో ఐసీసీ ఆరు పాయింట్లు కోత విధించింది. దీంతో ఇప్పటికే మ్యాచ్‌లో ఓడన పాకిస్థాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలినట్లయింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆ జట్టు కూడా నిర్ణీత సమయంలోగా బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. నాలుగు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినందుకు గానూ.. నాలుగు పాయింట్లు కోత విధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ చేరాలన్న పాకిస్థాన్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి.

షకిబ్‌ పైనా చర్యలు..

ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ షకిబ్ అల్ హసన్‌పై కూడా ఐసీసీ చర్యలు చేపట్టింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్‌ రిజ్వాన్‌ బ్యాటింగ్‌కు సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన షకిబ్.. అతడివైపు బంతిని విసిరాడు. అది వెళ్లి కీపర్‌ చేతిలో పడింది. ఇది జరిగిన వెంటనే అంపైర్‌ కూడా మందలించాడు. ఈ నేపథ్యంలో షకిబ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. అంతేకాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్‌ కండక్ట్‌ లెవల్ 1ను ఉల్లంఘించినందుకు ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా అతడి ఖాతాలో జమచేసింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌.. పాక్‌ గడ్డపై అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ను కుప్పకూల్చి అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి స్వయంగా ఓటమిని ఆహ్వానించిన పాక్‌ జట్టుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Monday, 26 August 2024

పేదోళ్ల ఇండ్లపైకి బుల్డోజర్‌.. మరి మంత్రి సౌధం మీదికి సాగలేదేమి?

 

పేదోళ్ల ఇండ్లపైకి బుల్డోజర్‌.. మరి మంత్రి సౌధం మీదికి సాగలేదేమి?

 

రాష్ట్రంలో బుల్డోజర్‌ పాలన కొనసాగుతున్నది. ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూలగొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 .సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్‌

  • పోలీసు నీడలో కూల్చివేతలు
  • తెల్లారేసరికే వచ్చిన అధికారులు
  • నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం!
  • రాయదుర్గంలో రోడ్డునపడ్డ బాధిత కుటుంబాలు
  • మమ్మల్ని నిర్బంధించి ఇండ్లు కూల్చిండ్రు
  • అనుమతులు, స్టే ఉన్నా కూలగొట్టిండ్రు : బాధితుల ఆవేదన
  • యూనిటీ మాల్‌ కోసమే కూలదోశారని ఆరోపణ

హైదరాబాద్‌లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గంలో సోమవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, లిడ్‌క్యాప్‌, టీఎస్‌ఐఐసీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ మూడు నివాసాలు, ఐదు నిర్మాణాలు కూల్చివేశారు. తాత ముత్తాతల నుంచి నివాసముంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూల్చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం ఏడుగంటలకే పోలీసు బలగాలతో వచ్చిన అధికారులు ఇండ్లను కూలగొట్టడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవి హైడ్రా కూల్చివేతలు కానప్పటికీ ఇలా అకస్మాత్తుగా వచ్చి ఇండ్లను కూల్చేయడంతో రోడ్డున పడ్డ కుటుంబాల వేదన చెప్పనలవి కాకుండా ఉన్నది. అధికారులు కూల్చివేతలు చేపట్టిన స్థలంపై కోర్టు స్టే ఉన్నది. అయినా అదేమీ పట్టని అధికారులు బాధితుల ఆక్రందనల మధ్యే ఇండ్లను కూల్చేశారు.

HYDRA | కొండాపూర్‌, ఆగస్టు 26 : రాష్ట్రంలో బుల్డోజర్‌ పాలన కొనసాగుతున్నది. ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూలగొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నోటీసులు ఇవ్వకుండా తెల్లావారి ఏడుగంటలకే అధికారులు భారీగా పోలీసు బలగాలతో మోహరించి కోర్టు స్టే ఉన్న స్థలంలోనూ నివాసాలను కూలగొట్టడంతో ఆ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో సోమవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, లిడ్‌క్యాప్‌, టీఎస్‌ఐఐసీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ మూడు నివాసాలు, ఐదు నిర్మాణాలు కూల్చివేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇండ్లల్లో ఉన్న సామగ్రి అంతటినీ బయట పడేసి అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు. తమను నిర్బంధించి మరీ ఇండ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘మా తాత ముత్తాతల నుంచి ఈ ఇండ్లల్లోనే ఉంటున్నం.. ఏటా జీహెచ్‌ఎంసీకి ఆస్తి పన్ను చెల్లిస్తున్నం.. కరెం టు బిల్లులు కడుతున్నం.. ఈ భూమికి సంబంధించి కోర్టు స్టే కూడా ఇచ్చింది. సోమవారం కోర్టులకు సెలవు ఉండటంతో ఇదే అదునుగా పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి బుల్డోజర్లతో తమ ఇండ్లను కూలగొట్టిండ్రు. పిల్లలున్నరు.. ఆరోగ్యం బాగలేనోళ్లున్నరు. ఏమాత్రం సోయి లేకుండా అధికారులు రాక్షసుల్లా వచ్చి తమ ఇండ్ల మీద పడి కూల్చిండ్రు. ఇప్పుడు తాము ఏడుండాలె?’ అంటూ బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

గంట వ్యవధిలోనే నేలమట్టం
రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నంబర్లలో 37.08 ఎకరాల భూమి ఉన్నది. ఇది హైదరాబాద్‌ టెన్నరీస్‌కు చెందినదని, దాని పూర్తి హక్కులు తమకు వంశపారపర్యంగా వస్తున్నాయని కొన్ని కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నాయి. కాగా ఇవి లిడ్‌క్యాప్‌ (లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట కార్పొరేషన్‌)కు చెందిన భూములుగా అధికారులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో భూములపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నది. ఈ క్రమంలో సోమవారం తెల్లారుజామున ఐదు గంటలకు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, లిడ్‌క్యాప్‌, టీఎస్‌ఐఐసీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇండ్లు కూల్చివేస్తామని సమాచారం ఇచ్చి ఉదయం ఏడు గంటల్లోపు వంద మంది పోలీసు బలగాలు, బుల్డోజర్లు అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా కొంతమేర సామగ్రిని వారంతా తీసుకొని బయటికి వచ్చారు. ఏడు గంటల ప్రాంతంలో కూల్చివేతలు మొదలు కావడంతో బాధితులు లబోదిబోమని అడ్డుకు నే ప్రయత్నంచేశారు. పోలీసులు తమను పక్కకు తీసుకెళ్లి, కదలకుండా చుట్టూ మోహరించినట్టు బాధితులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు ఇండ్లతోపాటు సమీపంలోని ఐదు నిర్మాణాలను నేలమట్టం చేశారు.

యూనిటీ మాల్‌ కోసమే?
1942లో తమ పూర్వీకులు హైదరాబాద్‌ టెన్నరీస్‌ సంస్థను ఏర్పాటు చేసి అక్కడే నివా సం ఉన్నారని, ప్రస్తుతం అధికారులు కూల్చివేసిన ఇండ్లకు సైతం ఇంటి నంబర్లతోపాటు కరెంటు బిల్లులు, పన్నులను రెగ్యులర్‌గా జీహెచ్‌ఎంసీకి చెల్లిస్తున్నామని బాధితులు తెలిపా రు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేయడం రాక్షస పాలన కు నిదర్శనమంటూ ఆవేదన వ్యక్తంచేశారు. లిడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో యూనిటీ మాల్‌ నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.500 కోట్లు వచ్చాయని, తమకు భూములు అప్పగించాలంటూ బసిరత్‌ అలీఖాన్‌ కుటుంబంపై లిడ్‌క్యాప్‌ ఎండీ శ్రీనివాస్‌ నాయక్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ ఒత్తిడి చేసినట్టు, లిడ్‌క్యాప్‌ జీఎం వేణుమాధవ్‌ ద్వారా చర్చలకు పిలిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సదరు స్థలం తమ కుటుంబానికి చెందినదని, ఏవైనా సమస్యలుంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలని లిడ్‌క్యాప్‌ యాజమాన్యానికి తెలిపామని చెప్పారు. ‘మీ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగి ఆ భూమిని మా ఆధీనంలోకి తీసుకుంటం’ అంటూ లిడ్‌క్యాప్‌ యాజమాన్యం బెదిరించినట్టు బాధితులు వాపోతున్నారు.

అధికారులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నరు
మా ముత్తాతలు హైదరాబాద్‌ టెన్నరీస్‌ సంస్థను స్థాపించినప్పటికే 37.08 ఎకరాల భూమి ఉన్నది. కానీ అధికారులు స్థలమంతా లిడ్‌క్యాప్‌దంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు. లిడ్‌క్యాప్‌ సంస్థకు కేవలం 5 ఎకరాల స్థలం మాత్రమే ఉన్నది. మా భూములను అన్యాయంగా, దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్ద వయస్సు వారున్నారన్న కనీస జ్ఞానం లేకుండా ఉదయం 7 గంటలకే వచ్చి ఇండ్లు కూల్చివేశారు. ఇప్పుడు మా కుటుంబాలు ఎక్కడికి పోవాలి? ఉదయం నుంచి రోడ్డుపై పడిగాపులు కాస్తున్నం. ప్రజాపాలనలో అధికారులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నరు.
-నసిర్‌ అలీఖాన్‌, బాధితుడు

ప్రజా పాలనంటే ఇదేనా?
ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కూల్చివేతలు చేపట్టవద్దని స్టేటస్‌ కోలు ఉన్నయి. అయి నా అధికారులు ఎలాంటి ముంద స్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దలు ఉన్నారన్న కనీస సోయి లేకుండా కూల్చివేశారు. హృద్రోగ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మా కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లాలో అర్థంకాని పరిస్థితి తెచ్చారు. రేవంత్‌రెడ్డి చెబుతున్న ప్రజాపాలన అంటే ఇదేనా?
-ముఖ్తర్‌ అలీఖాన్‌, బాధితుడు

మరి మంత్రి సౌధం మీదికి సాగలేదేమి?

17

‘ప్రభుత్వ భాగస్వాములకూ ఫాంహౌస్‌లు ఉన్నాయి. నాపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా ఎవర్నీ వదలను. మిత్రుల ఫాంహౌస్‌లు ఉన్నా తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశా’.. ఈ నెల 25న సీఎం రేవంత్‌ రెడ్డి మాట ఇది.
‘కొత్త టేపులు తెచ్చి కొలుచుకోండి. నా ఫాంహౌస్‌ ఎఫ్‌టీఎల్‌లోనో, బఫర్‌ జోన్‌లోనో ఉంటే కూల్చుకోండి. ఒక్క ఇటుక పెళ్ల ఉన్నా వెంటనే పడగొట్టండి. దిస్‌ ఈజ్‌ మై చాలెంజ్‌. ఈ వేదికపై నుంచి హైడ్రా అధికారి రంగనాథ్‌ను కూడా ఆదేశిస్తున్నా’.. ఈ నెల 24న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాలెంజ్‌ ఇది.

ఎవర్నీ వదిలేదని రేవంత్‌రెడ్డి అన్నా.. తన ఇల్లు బఫర్‌ జోన్లో ఉంటే కూల్చేయండి అంటూ ఆయన మంత్రివర్గ సహచరుడు పొంగులేటి ఆదేశించినా.. హైడ్రా అటువైపే పోలె. కానీ, ఏ నోటీసు ఇవ్వకుండానే సామాన్యుడి ఇంటి మీదికి మాత్రం బుల్డోజర్‌ వచ్చింది. 40 ఏండ్లుగా ఉంటున్న పెంకుటిల్లును మాత్రం కూలగొట్టింది.

ఏది ఎఫ్‌టీఎల్‌, ఏదీ బఫర్‌? ఏది ప్రొహిబిటెడ్‌ జోన్‌, ఏది రిస్ట్రిక్టెడ్‌ జోన్‌? కొలతలు వేసింది ఎవరు? హద్దురాళ్లు ఎక్కడున్నాయి? ఇవేవీ తెలియకున్నా కొందరి ఇండ్లు కూలుతున్నాయి. కొందరి ఇండ్లు నిలుస్తున్నాయి. నా ఇల్లు ఎఫ్‌టీఎల్‌లోనో, బఫర్‌లోనో ఉంటే కూల్చుకోండి అంటూ సవాల్‌ విసిరిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ఎఫ్‌టీఎల్‌కు అర కిలోమీటర్‌ దాకా నిర్మాణాలకు నిషిద్ధ ప్రాంతమే! అంటూ నమస్తే తెలంగాణ బయటపెట్టిన మెమోపై మాత్రం నోరువిప్పలేదు. నదిపై నిర్మించిన జలాశయాల వద్ద నిర్మాణ అనుమతులకు సంబంధించి 2012లో ప్రభుత్వం తెచ్చిన168 జీవోనూ ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. దీనిపైనా సీఎం సహా మంత్రులెవరూ కిమ్మనలేదు. మరి 500 మీటర్లలోపు నిర్మాణాలు సక్రమమా? అక్రమమా? ఆ ఇండ్లు బఫర్‌ జోన్‌లో ఉన్నట్టా? లేనట్టా? ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్టా? లేనట్టా? నిర్మాణాలు సక్రమమైతే సర్వే చేసి నిర్ధారించి, బహిరంగ ప్రకటన చేయొచ్చుగా? అక్రమమైతే హైడ్రా రంగంలోకి దిగదెందుకు? హైడ్రా తన పరిధి దాటి కూడా గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు అక్రమమంటూ కొన్నింటిని కూల్చివేసింది. మరి మిగతా వాటిని ఎందుకు వదిలిపెట్టినట్టు? ముఖ్యంగా నిబంధనల ప్రకారం తన నిర్మాణాలు లేనట్టయితే కూల్చుకోండి అని మంత్రి పొంగులేటి ఆఫర్‌ ఇచ్చినా హైడ్రా రంగంలోకి దిగేందుకు ఏ శక్తి అడ్డుకుంటున్నది?