గారెలు
నోరూరించే మసాలా వడ
గారెలు లేదా వడలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది “తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి.” అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని కొబ్బరిపచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, శనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.
గారెలు అంటే..
గారెలు అంటే..మనకు ఎక్కువగా గుర్తొచ్చేది మినపగారెలే.
గారెలు – తయారు చేయడం చాలా సులభం
నిజం చెప్పాలంటే గారెలు తయారు చెయ్యడం చాలా సులభం. అసలు వంటేమీ రాని వారు కూడా చాలా చక్కగా, రుచికరంగా గారెలు తయారు చేసుకోవచ్చు. మీ స్నేహితులకీ, బంధుమిత్రులకీ రుచి చూపించి ‘ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..’ అనిపించవచ్చు.
రకాలు
మినప గారెలు
పాకం గారెలు
పెరుగు గారెలు – లేదా – ఆవడలు పెరుగు గారెలనే ఆవడలు అని కూడా అంటారు. గారెలు చేసి పెరుగు తాలింపు లో వేయాలి.
సగ్గుబియ్యం గారెలు
అలచంద గారెలు
పెసర గారెలు
చెక్క గారెలు
శనగ గారెలు
అల్లం మిర్చి మినప పుణుకు
చిట్కాలు
గారెలు మరింత రుచిగా ఉండుటకు నూతనంగా కొన్ని మార్పులు చేస్తున్నారు.
మినుములతో పాటు కొద్దిగా బొబ్బర్లు, కొద్దిగా జీడిపప్పు, కొంత బంగాళాదుంప కలపడం జరుగుతుంది. వీటి కలయికతో గారె రుచి మరింత పెరుగుతుంది.
మరి ఈ వంటకాన్ని స్పెషల్ గా చేసుకోవాలంటే కావలసిన పదార్ధాలు : మినప పప్పు : 1/2kg పచ్చిమిర్చి: 2 అల్లం: కొద్దిగా మిరియాలు: 1tsp ఉల్లిపాయలు: 4-5 ఉప్పు: రుచికి సరిపడ నూనె: వేయించడానికి సరిపడా వంటసోడ : చిటికెడు తయారు చేయు విధానం : 1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
2. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, మిరియాలపొడి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని రుబ్బిన పప్పులో కలపాలి.
3. తర్వాత స్టౌ వేలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కాగనివ్వాలి.
4. ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడీ
No comments:
Post a Comment