తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు పార్టీలో చేరారు.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు జిష్ణుదేవ్ వర్మ నాలుగో గవర్నర్. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 10
రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురిని కొత్తగా నియమించగా, మరో ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఈ లిస్ట్ లో తెలంగాణ గర్నవర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఇన్నిరోజులు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయనను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. దీంతో కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ బాధ్యతలు చేపట్టారు.
జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. త్రిపుర ప్రభుత్వంలో జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా.. విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్థిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలు నిర్వహించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈయన రచయిత కూడా. ఇటీవల తన జ్ఞాపకాలను "views, reviews & my poems" పేరుతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పుస్తకంలో త్రిపుర చరిత్రకు సంబంధించిన చాలా అంశాలను జిష్ణుదేవ్ వర్మ ప్రస్తావించారు.
No comments:
Post a Comment