Wednesday, 31 July 2024

శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ సమస్యకు చెక్ పడినట్లే!

Tirumala: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ సమస్యకు చెక్ పడినట్లే!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో టీటీడీ అడుగులు వేస్తోంది. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు.. తిరుమలలోని హోటళ్లు, క్యాంటీన్లకు టీటీడీ ఈవో కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యర్థాల నిర్వహణ కోసం రెండు బిన్ల విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,డీల్స్ చూడండి

  • తిరుమల వెంకన్న దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. శ్రీవారి అన్న ప్రసాదం దగ్గర నుంచి క్యూలైన్ల నిర్వహణ వరకూ ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా తిరుమల కొండను పరిశుభ్రంగా ఉంచేందుకు టీటీడీ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని పెద్ద, చిన్న హోటళ్లు సహా తినుబండారాలను విక్రయించే ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణకు రెండు చెత్త బిన్ల వ్యవస్థను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భక్తుల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించేందుకు ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Samayam TeluguTirumala


ఏపీటీడీసీ హోటళ్లు, జనతా క్యాంటీన్లపై తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు తడి, పొడి చెత్త విధానాన్ని అనుసరించాలని సూచించారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. హోటల్ యజమానులు కూడా తన హోటల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆహార పదార్థాల ధరలతో బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఆహార పదార్థాలలో నిషేధిత రంగులను ఉపయోగించకూడదని ఈవో స్పష్టం చేశారు. 12 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారికి టేస్ట్ ఎన్‌హేన్సర్‌తో తయారుచేసిన ఆహార పదార్థాలు ఇవ్వకూడదని ఈవో ఆదేశించారు. అలాగే లైసెన్స్ పొందిన నిర్వాహకులు ఎలాంటి సబ్ లీజులు ఇవ్వకూడదని ఆదేశించారు.
ఇక జనతా క్యాంటీన్లు కూడా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలోని హోటళ్ల వారికి ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆగస్ట్ 5 నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తామని ఈవో తెలిపారు. అలాగే క్యాంటీన్లు, హోటళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని.. మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు.

No comments:

Post a Comment