Friday, 12 July 2024

యాదాద్రి కొండపై అపచారం.. చీ..చీ..బాత్రూంలో ఇదేం పని..!

                                 యాదాద్రి కొండపై అపచారం.. చీ..చీ..బాత్రూంలో ఇదేం పని..!

                        :పవిత్ర యాదాద్రి కొండపై అపచారం జరిగింది. ఆలయ పవిత్రకు భంగం కలిగేలా కొందరు ఉద్యోగులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. కొండపై మద్యం, మత్తు పదార్థాలు వంటి వాటిపై నిషేదం అమల్లో ఉండగా.. క్యూ కాంప్లెక్స్‌లోని మెన్స్ బాత్రూంలో లిక్కర్ బాటిల్‌తో గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

ప్రధానాంశాలు:

యాదాద్రి కొండపై అపచారం

బాత్రూంలో ముందు బాటిల్

సిబ్బంది పనే అంటున్న భక్తులు

పుణ్యక్షేత్రం వద్ద ఇవేం పనులు.. యాదాద్రిలో టాయిలెట్లలో..

                        తెలంగాణలో సుప్రిసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి. తిరుపతి తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది భక్తులు దర్శించే పుణ్యక్షేత్రం యాదాద్రి. కొండపై కొలువు దీరిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని భక్తులు తమ మెుక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. ఆలయాన్ని పునర్నిర్మాణం తర్వాత.. ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వెళ్తున్నారు. ఇక తిరుమల తరహాలో భక్తులకు యాదాద్రి ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే కొందరు ఉద్యోగుల తీరుతో ఆలయ పవిత్రకు భంగం వాటిల్లుతోంది.

              తాజాగా.. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపై మద్యం బాటిల్, గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కొండపై గల క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న పురుషుల బాత్రూంలో ఓ లిక్కర్ బాటిల్‌తో పాటు తిని పడేసిన గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఎస్పీఎఫ్ పోలీసుల నిఘాలోపం, ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఆలయ సిబ్బంది కొండపైకి విధుల్లోకి వచ్చే ముందు మద్యం సేవించారని భక్తులు ఆరోపిస్తున్నారు. సిగ్గు లేకుండా బాత్రూంలో మందు కొట్టి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు.

            ఈ ఘటనపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే స్పందన లేదని చెబుతున్నారు. ఆలయ ఈవోను సంప్రదించగా.. ఫోన్ స్విచ్ఛాప్ వచ్చిందని.. సంబంధింత అధికారిని వివరణ కోసం ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదని భక్తులు అంటున్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పవిత్రమైన యాదాద్రి కొండపై ఇలాంటి పనులు చేయటం దారుణమని.. ఇలా చేయటం ద్వారా ఆలయ పవిత్రత దెబ్బతింటుందని అంటున్నారు.

కొండపై పెరిగిన భక్తుల రద్దీ..

ఇక యాదాద్రికి భక్తులు పోటెత్తున్నారు. వీకెండ్ కావటంతో ఎక్కువ సంఖ్యలో ఆలయానికి చేరుకొని మెుక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వెళ్తున్నారు. యాదాద్రి కొండపై జూన్ నెల నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక దర్శనానికి వెళ్లేవారు కచ్చితంగా సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. ఇక కొండపై ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.





No comments:

Post a Comment