ఆ కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాల్సిందే -కేటీఆర్ పౌరసరఫరాల శాఖలో 11 వందల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని, దానిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం తప్పించుకోడానికి ప్రయత్నిస్తోందని, తమ ప్రశ్నల్ని బుల్డోజ్ చేసుకుని పోతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదనేది తప్పుడు ప్రచారం అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని రేషన్ కార్డ్ లు జారీ చేశామనే విషయాన్ని లెక్కలతో సహా వివరిస్తే, దాన్ని కూడా దాటేవేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. Also Read - తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ సీజేఐ హౌస్ కమిటీకి డిమాండ్... పౌరసరఫరాల శాఖలో 11 వందల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని, దానిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. సివిల్ సప్లయ్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ. 11 వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారాయన. ఇందులో మంత్రి హస్తం లేకపోయినా పెద్దల హస్తం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానమిస్తున్న తీరు కూడా సరికాదన్నారాయన. హౌస్ కమిటీకోసం కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షం ఏం చెప్పిన సరే ప్రభుత్వానికి రుచించటం లేదని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, మద్యం పాలసీ.. తదితర అంశాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మంగళవారం సివిల్ సప్లై శాఖలో జరిగిన కుంభకోణం చర్చనీయాంశమైంది. దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభనుంచి వాకవుట్ చేశారు.
No comments:
Post a Comment