హైదరాబాద్‌లో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు: అడ్రస్సులు ఇవే
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం ఆరు జోన్లల్లో వాటిని నెలకొల్పారు అధికారులు. స్థానిక సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించడంలో భాగంగా అవి అందుబాటులోకి వచ్చాయి. శుక్రగోచారంతో పాటు అద్భుతయోగం.. నేటినుండి 25రోజులు వీరి పంట పండినట్టే!! ఏ జోన్‌కు సంబంధించిన సమస్యలు ఆ జోన్ పరిధిలోనే పరిష్కారానికి నోచుకునేలా ఈ వ్యవస్థను తెర మీదికి తీసుకొచ్చింది గ్రేటర్ హైదరాబాద్. స్థానికులు తమ దరఖాస్తులను ఈ ప్రజా పాలన కేంద్రాల్లో దాఖలు చేయవచ్చు. వాటి స్టేటస్ ఏమిటనేదీ ఇక్కడి నుంచే తెలుసుకోవచ్చు. ఆయా దరఖాస్తుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కేంద్రాలను ఆశ్రయించవచ్చు. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం: ప్రధాన నిందితుడి అరెస్ట్ శేరిలింగంపల్లి జోన్.. చందానగర్ సర్కిల్- మాదాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్ వార్డు కార్యాలయాలు. శేరిలింగంపల్లి సర్కిల్- కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, వార్డు కార్యాలయాలు. రామచంద్రాపురం-పఠాన్‌చెరు సర్కిల్స్ పరిధిలో భరత్ నగర్ (పీ), ఆర్సీపురం, పఠాన్‌చెరు వార్డు కార్యాలయాలు వస్తాయి.
సికింద్రాబాద్ జోన్..
ముషీరాబాద్ సర్కిల్: ముషీరాబాద్, అంబర్‌పేట్, బేగంపేట్, మల్కాజ్‌గిరిల్లో సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్ వార్డు కార్యాలయాలు సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. ఎల్బీ నగర్ జోన్ కాప్రా, ఉప్పల్ సర్కిల్ కార్యాలయాల్లో సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ, చంపాపేట్ వార్డు కార్యాలయాలు ఉంటాయి. హయత్‌నగర్ సర్కిల్‌లో హయత్‌నగర్, నాగోల్, మన్సూరాబాద్, బీఎన్ రెడ్డి నగర్ వార్డు కార్యాలయాలు ఉంటాయి. హయత్‌నగర్ సర్కిల్‌లో పరిధిలో- సరూర్ నగర్, ఆర్కే పురం, కొత్తపేట్, చైతన్యపురి, గడ్డిఅన్నారం వార్డు కార్యాలయాలు వస్తాయి.
ఖైరతాబాద్ జోన్.. మెహిదీపట్నం సర్కిల్ పరిధిలో- మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, విజయ్ నగర్ కాలనీ, అహ్మద్ నగర్, రెడ్ హిల్స్, మల్లేపల్లి వార్డు కార్యాలయాలు వస్తాయి. కార్వాన్ సర్కిల్‌లో కార్వాన్, జియాగూడ, లంగర్‌హౌస్, గోల్కొండ, టోలిచౌకీ, నానల్ నగర్, కార్వాన్ వార్డు కార్యాలయాలు ఉంటాయి.
గోషామహల్ సర్కిల్- గోషామహల్, బేగంబజార్, మంగళ్‌హాట్, దత్తాత్రేయ, గోషామహల్, జాంబాగ్
వార్డు కార్యాలయాలు వస్తాయి. కూకట్‌పల్లి జోన్ మూసాపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిల్ కార్యాలయాలు కూకట్‌పల్లి పరిధిలో ఉంటాయి. స్థానికులు తమ దరఖాస్తులను ఆయా ప్రజా పాలన కేంద్రాల్లో దాఖలు చేయవచ్చు.
చార్మినార్ జోన్.. చార్మినార్, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, ఫలక్‌నుమా సర్కిల్ కార్యాలయాలు, రాజేంద్రనగర్ డీసీ కార్యాలయం, మైలార్‌దేవ్‌పల్లి, సులేమాన్ నగర్, అత్తాపూర్, శాస్త్రీపురం, రాజేంద్రనగర్ వార్డు ఆఫీసులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి.
No comments:
Post a Comment