అడ్డదారులకు ఇక చెక్.. కంప్యూటర్ పరీక్షలో పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్
డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలకు, అడ్డదారిలో లైసెన్సులు పొందేవారికి చెక్ పెట్టేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ఆధునీకరించాలని నిర్ణయించారు.
అడ్డదారులకు ఇక చెక్.. కంప్యూటర్ పరీక్షలో పాసైతేనే డ్రైవింగ్ లైసెన్స్
కొత్తగా ఆటోమెటిక్ పద్ధతిలో పరీక్ష
Driving License | హైదరాబాద్, : డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలకు, అడ్డదారిలో లైసెన్సులు పొందేవారికి చెక్ పెట్టేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ఆధునీకరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షను తొలగించి, మరింత ప్రామాణికమైన ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్ట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇకపై లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. రహదారులపై నిత్యం ఎదురయ్యే సమస్యలను కొత్త పద్ధతిలో టెస్ట్ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఆ ట్రాక్‌పై వాహనం నడిపినప్పుడు కంప్యూటర్‌లో రికార్డు అవుతుంది. దీంతో సక్రమంగా వాహనం నడిపినవారికే లైసెన్సు లభిస్తుంది.
డ్రైవింగ్‌లో ఏ చిన్న తప్పు చేసినా పరీక్షలో ఫెయిల్ అయినట్టే.
లైసెన్స్ జారీకి కొత్త పద్ధతులు ఇవీ..
ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్ట్‌లో 5 ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు.
ముందుగా ‘హెచ్’ ట్రాక్‌లో వాహనాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ‘ఎస్’ ట్రాక్‌లో వాహనాన్ని ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాలి.
చివరగా మలుపులు, ఎత్తుపల్లాలు, గతుకులతో ఉండే ‘కే’ ట్రాక్‌లో వాహనాన్ని నడిపి, సక్రమంగా పార్క్ చేసిచూపాలి.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం టూవీలర్ డ్రైవర్ హెల్మెట్, ఫోర్‌వీలర్ డ్రైవర్ సీటుబెల్ట్ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్‌లో రికార్డవుతుంది.
వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా టెస్టులో ఫెయిల్ అయినట్టు కంప్యూటర్‌లో చూపిస్తుంది.
పరీక్షలో ఫెయిలైన వారిని మరో నెల రోజులు శిక్షణ తీసుకుని మళ్లీ టెస్టుకు రమ్మంటారు.
No comments:
Post a Comment