ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల ద్వారా మెరుగైన సేవలు అనించేందుకుగాను అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు.
మంగళవారం ఆయన తన చాంబర్లో ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలల బలోపేతం విషయమై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు.
ముందుగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని, ఇందుకురాను ఆయా ఆసుపత్రులు, పాఠశాలల వారీగా నివేదిక సమర్పించాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన తరగతిగదులు ,టాయిలెట్లు,విద్యుత్,క్రీడా ప్రాంగణం, లైబ్రరీ, వంటగది వంటి
కనీస సౌకర్యాలు ఉండాలని ఆన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో సైతం ఓపితోపాటు, ముఖ్యమైన సేవలు,ప్యాత్యేకించి మాతా శిశు సంరక్షణ సేవలందించేందుకు వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆయా నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు
____________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
No comments:
Post a Comment