తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ సీజేఐ విచారణ కొనసాగుతుండగా ఛైర్మన్‌గా ఉన్న నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడడం వివాదాస్పదమైంది. దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో జస్టిస్ మదన్ బి లోకూర్‌ను ఛైర్మన్‌గా నియమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ కమిషన్ విచారణ జరపనుంది. విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు రేవంత్ సర్కార్ 2024 మార్చి 14న కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ నరసింహా రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. విచారణ ప్రారంభించిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చింది. అయితే విచారణ కొనసాగుతుండగా ఛైర్మన్‌గా ఉన్న నరసింహా రెడ్డి మీడియాతో మాట్లాడడం వివాదాస్పదమైంది. దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment