నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
Srisailam project | ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. నీటిని దిగువకు పంపేందుకు గేట్లు తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మంగళవారం రాత్రి 10 గేట్లను పదేసి అడుగుల మేర పైకి ఎత్తారు. దిగువన నాగార్జున సాగర్‌కు 3.59 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. నీటిని దిగువకు పంపేందుకు గేట్లు తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మంగళవారం రాత్రి 10 గేట్లను పదేసి అడుగుల మేర పైకి ఎత్తారు. దిగువన నాగార్జున సాగర్‌కు 3.59 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదిలావుంటే జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి మొత్తం 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.90 అడుగులకు చేరింది. నీటి నిలువ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 209.59 టీఎంసీల నీరు నిలువ ఉంది.
తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 35,315 క్యూసెక్కుల నీటి సాయంతో 18.437 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా.. ఏపీ పరిధిలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 25,684 క్యూసెక్కుల నీటితో 15.201 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
No comments:
Post a Comment