Thursday, 18 July 2024

వారఫలితాలు తేదీ 12 జూలై 2024 శుక్రవారం నుండి 18 గురువారం ...

 

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది. ముఖ్య విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. చిన్నపాటి అనారోగ్యాలు బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినా నిదానంగా మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సమయస్ఫూర్తితో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దీర్ఘ కాలిక వివాదాలు కొన్ని పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు నెరవేరతాయి. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు క్రమ క్రమంగా మెరుగుపడుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్పరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విబేధాలుంటాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. ఆప్తులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. గోచార రిత్య మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

ఈ వారం ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన రుణ కోసం ప్రయత్నిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగతాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి. శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు ప్రయత్నాలు కొంత నిరాశ చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు. వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అధికారులతో చర్చలు సఫలమౌతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పాత ఋణాలు కొంత వరకు తొలగుతాయి. బందు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లక్ష్యాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది. గోచార రిత్య మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాల కలిగిస్తాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట బయట అందరిని మంచి మాట తీరుతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి కొంత వరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. చిన్నతరహా ప్రయత్నాలు సఫలమౌతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బందువులతో వివాదాలు కొంత బాధిస్తాయి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధు మిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహణపై చర్చలు జరుపుతారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఒక సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో కలహా సూచనలున్నవి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. గృహమున శుభకర్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత అధికారులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదులుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

No comments:

Post a Comment