Gold Rate Today:శ్రావణ మాసంలో బంగారం కొంటున్నారా? తరుగు,మజూరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?
Gold Price Today:శ్రావణమాసం బంగారం కొంటున్నారా? అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today Gold Rate: మనం బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రధానంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఫలితంగా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధరలు భారీ గా పెరిగిన నేపథ్యంలో ఒక్క గ్రాము తేడా వచ్చిన మీకు సుమారు 6వేలకు పైగా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బంగారం కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శ్రావణమాసంలో మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హాల్ మార్క్ చెక్ చేసుకోవాలి: మీరు బంగారం కొనుగోలు చేసేటప్పుడు, ఖచ్చితంగా హాల్ మార్కు అనేది చెక్ చేసుకోవాలి లేకపోతే మీరు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ లేని నగలను ఆభరణాల దుకాణాలలో అమ్మనివ్వడం లేదు. కనుక ప్రతి నగకు హాల్ మార్క్ ఉందా లేదా అనేది మీరు తప్పనిసరిగా చెక్ చేసుకుని కొనుగోలు చేసుకోవాలి. చిన్న దిద్దుల నుంచి పెద్ద నగల వరకు మీరు ప్రతి నగ మీద హాల్ మార్కును చెక్ చేసుకుని కొనుగోలు చేయండి.
బంగారం తూకం కరెక్ట్ గా చూసుకోవాలి: బంగారంలో ఒక మిల్లీగ్రామ్ తేడా వచ్చిన మీకు పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. అందుకే మీరు తప్పనిసరిగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు మీరు ముందుగా ఒకటికి రెండుసార్లు తూకాన్ని చెక్ చేసుకోవాలి మీరు కొనుగోలు చేసే నగల దుకాణంలోని తూకం చూసే మిషన్లో బంగారం బరువును తూచాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు కొనుగోలు చేసిన ఆభరణాల్లోని రత్నాలు అదేవిధంగా స్టోన్స్ ఏవైనా వాడినట్లయితే వాటి బరువును కూడా ప్రత్యేకంగా వేసి మొత్తం నగల బరువును తూచాల్సి ఉంటుంది. మీరు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా వేరువేరు తూకం మెషిన్లలో బరువును చెక్ చేయించుకోవాలి.
నగల బిల్లు దాచి పెట్టుకోవాలి: నగల దుకాణంలో బిల్లు తప్పనిసరిగా దాచిపెట్టుకోవాలి లేకపోతే మీరు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి నగల దుకాణం వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు బంగారం నగలతో సమానంగా వాటి బిల్లులను కూడా ఖచ్చితంగా దాచి పెట్టుకోవాలి. మీరు నగలను ఎంత కాలం అయితే వాడుతారో, అంతకాలం నగల రసీదును కచ్చితంగా దాచి పెట్టుకోవాలి. ఒక్కోసారి మీరు నగలను మార్పిడి చేసుకునే సమయంలో ఈ బిల్లు మీకు ఉపయోగపడుతుంది. అలాగే చాలా మంది జీఎస్టీ లేకుండా మీకు నగలు అమ్ముతామని చెబుతుంటారు. ఇందులో మోసం ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జీఎస్టీ లేని బిల్లులు చెల్లుబాటు కావు. తద్వారా మీకు బంగారం విషయంలో ఏదైనా తేడా జరిగితే మీరు వినియోగదారుల హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జీఎస్టీ లేని ఆభరణాల పేరిట బంగారం ధరను లేదా మజూరీ, ఇతర చార్జీలను పెంచి మీ వద్ద నుంచి పూర్తి స్థాయి డబ్బులనే వసూలు చేస్తారనే సంగతి గమనించాలి.
తరుగు, మజూరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి: బంగారం తరుగు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. తరుగు అనేది నగలు తయారీలో కోల్పోయిన బంగారం అని అర్థం. అయితే ఈ తరుగు విషయంలో ఒక్కో నగల షాపు ఒకోరకంగా చార్జి చేస్తుంది. మీకు ఏ షాపులో అయితే తరుగు, మజూరి తక్కువగా ఉంటాయో అక్కడ కొనుగోలు చేస్తే మంచిది. మజూరీ విషయంలో కూడా ఆయా షాపును బట్టి ధర మారుతూ ఉంటుంది.
సాధారణంగా బంగారంలో క్వాలిటీని బట్టి క్యారెట్లను నిర్ణయిస్తారు. ఇందులో ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారాన్ని మేలు మీ బంగారం అంటారు 22 క్యారెట్ల బంగారాన్ని ఆర్నమెంట్ బంగారం అంటారు. మనము సాధారణంగా నగలు చేయించుకునే ఆభరణాల కోసం వాడే బంగారం ఇదే నేను మీ బంగారం 24 క్యారెట్ల తో ఆభరణాలు చేయించుకోరు అన్న సంగతి గుర్తుంచుకోండి.
అదే సమయంలో మీకు 18 క్యారెట్లు, 16 క్యారెట్లు, 12 క్యారెట్ల బంగారం కూడా అందుబాటులో ఉంటుంది. ఒక్కోసారి నగల షాపుల వారు 18 క్యారెట్ల తో నగలు చేసి మనకు 22 క్యారెట్లు అని చెప్పి అమ్ముతూ ఉంటారు. ఇలాంటి మోసాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి.
No comments:
Post a Comment