రేపటి నుండి రెండు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్
పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్‌దర్వాజా మహాకాళి(Laldarwaja Mahakali) బోనాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు వైన్సులు మూసి వేయాలని నిర్ణయించారు.
మహంకాళీ బోనాల పండుగ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రేపు (జూలై 28వ తేదీ) ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు అన్ని వైన్ షాపులు మూతపడనున్నాయి.
ఇక బోనాలకు అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ చంద్రశేఖర్ ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు. బోనాల సందర్భంగా ఛత్రినాక ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయం వద్ద నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు ఏనుగుపై ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఈనేపథ్యంలో 28, 29 తేదీల్లో ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్(Charminar, Meerchowk), బహదూర్‌పురా పోలీస్టేషన్‌లలోని పలు ప్రాంతాలు, నయాపూల్ నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుటాయని తెలిపారు.
No comments:
Post a Comment