*బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బ్యాగులు పంపిణీ*. ..
*కార్పోరేట్ స్కూల్ కి పోటిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తయారు చేయడమే మా లక్ష్యం.*
బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు
బుక్కా ఈశ్వరయ్య ......
రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ప్రైమరి మరియు హైస్కూల్ విద్యార్థుల కు కావలసిన సమాగ్రిని అన్ని వేళల అందిస్తున్న బుక్కా ఈశ్వరయ్య గారు ఈరోజు ప్రైమరి మరియు హైస్కూల్ విద్యార్థుకు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.*pvpm rao memorial పై pk మేహర్ (USA) గారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని ఈ వేదిక ద్వారా మేహర్ గారికి ధన్యవాదాలు తెలుపినారు*.
అనంతరం విద్యార్థుల ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ ప్రభుత్వం ఎంతో శ్రమకోర్చి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న ఊరి విడచి ఇతర ప్రాంతంలో గల ప్రైవేట్ స్కుళ్ళకు పిల్లను తల్లిదండ్రులు పంపడం బాదాకరమని అన్ని వసతులు, మంచివిద్యా ఉన్నందున ఎవ్వరు కూడ ఊరు వదలి పోవద్దని ఉద్భోదిస్తూ, మా బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో మీకు కావలసిన స్టేషనరి, ఆటవస్తువులు , బోజన పళ్ళాలు, గ్లాసులు, గతంలో అందించానని, ఇప్పుడు బ్యాగులు కూడ ఇస్తున్నానని, మంచి విద్యనబ్యసించి ఊరుకు, తల్లిదండ్రుల కు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరినారు.
ఈ కార్యక్రమంలో బెస్ట్ సేవా సొసైటీ చైర్మన్ కర్నాటి వెంకటేశ్వర్లు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపేందర్ జి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ , గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి , దాచేపల్లి ఈశ్వరయ్య ,ఆర్గనైజర్ వేముల సైదులు , ఉపాధ్యాయులు రాజన్ బాబు , భద్రయ్య , గనేష్ , గోపాల్ రెడ్డి , శ్రీనివాసరావు , కృష్ణ , అంగన్వాడీ టీచర్స్ సుధా , యశోద , ఉమా , స్వర్ణలత ,స్వప్న , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment