చౌకధర దుకాణ డీలర్లు ప్రతినెల 1 నుండి 15 లోపు తప్పనిసరిగా రేషన్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు.
బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో చౌకధర దుకాణాల డీలర్లు, జిల్లా రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు .
సంచాలకులురేషన్ సరఫరాలో సమయపాలన పాటించాలని ఆదేశించారు.ఎవరైనా లబ్ధిదారుల నుండి పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసినా లేదా పిడీస్ రేషన్ విషయంలో అక్రమాలకు పాల్పడిన ఆథరైజేషన్ రద్దు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు రైస్ మిల్లర్లతో కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్) చెల్లింపు పై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన వ్యవధి ప్రకారం సెప్టెంబర్ చివరినాటికి 2023- 24 ఖరీఫ్, అలాగే 2023- 2024 రబి సీఎంఆర్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు
2023- 24 ఖరీఫ్ కు సంబంధించి సి ఎం ఆర్ 61 శాతం , 2023- 24 రబీ 49 శాతం పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ సమావేశానికి జిల్లా పౌర
సర ఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు , ఎప్ సి ఐ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ షిండే,ఎం ఎల్ ఎస్ పాయింట్ల ఇన్చార్జీలు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది,,చౌక ధర దుకాణాల
డీలర్లు, జిల్లా రైస్ మిల్లర్లు తదితరులు హాజరయ్యారు
____________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
No comments:
Post a Comment