Wednesday, 31 July 2024

నోరూరించే మసాలా వడ

 గారెలు





నోరూరించే మసాలా వడ


గారెలు లేదా వడలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది “తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి.” అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని కొబ్బరిపచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, శనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.


గారెలు అంటే..

గారెలు అంటే..మనకు ఎక్కువగా గుర్తొచ్చేది మినపగారెలే.


గారెలు – తయారు చేయడం చాలా సులభం

నిజం చెప్పాలంటే గారెలు తయారు చెయ్యడం చాలా సులభం. అసలు వంటేమీ రాని వారు కూడా చాలా చక్కగా, రుచికరంగా గారెలు తయారు చేసుకోవచ్చు. మీ స్నేహితులకీ, బంధుమిత్రులకీ రుచి చూపించి ‘ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..’ అనిపించవచ్చు.


రకాలు

మినప గారెలు

పాకం గారెలు

పెరుగు గారెలు – లేదా – ఆవడలు పెరుగు గారెలనే ఆవడలు అని కూడా అంటారు. గారెలు చేసి పెరుగు తాలింపు లో వేయాలి.

సగ్గుబియ్యం గారెలు

అలచంద గారెలు

పెసర గారెలు

చెక్క గారెలు

శనగ గారెలు

అల్లం మిర్చి మినప పుణుకు

చిట్కాలు

గారెలు మరింత రుచిగా ఉండుటకు నూతనంగా కొన్ని మార్పులు చేస్తున్నారు.


మినుములతో పాటు కొద్దిగా బొబ్బర్లు, కొద్దిగా జీడిపప్పు, కొంత బంగాళాదుంప కలపడం జరుగుతుంది. వీటి కలయికతో గారె రుచి మరింత పెరుగుతుంది.

మరి ఈ వంటకాన్ని  స్పెషల్ గా చేసుకోవాలంటే కావలసిన పదార్ధాలు : మినప పప్పు : 1/2kg పచ్చిమిర్చి: 2 అల్లం: కొద్దిగా మిరియాలు: 1tsp ఉల్లిపాయలు: 4-5 ఉప్పు: రుచికి సరిపడ నూనె: వేయించడానికి సరిపడా వంటసోడ : చిటికెడు తయారు చేయు విధానం : 1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.


2. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, మిరియాలపొడి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని రుబ్బిన పప్పులో కలపాలి.


3. తర్వాత స్టౌ వేలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కాగనివ్వాలి.


4. ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడీ

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ పై సుప్రీం కీలక తీర్పు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.


 ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ పై సుప్రీం కీలక తీర్పు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  

            ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉప వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. 2004లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉప వర్గీకరణ చేయవద్దని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. 2004లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇ.వి. చిన్నయ్య వర్సెస్‌ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రిజర్వేషన్ ప్రయోజనాలను ఏ వర్గాలకు అందజేయవచ్చో రాష్ట్రపతి మాత్రమే తెలియజేయగలరని, దీన్ని తారుమారు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొన్నది.నాటి తీర్పుపై పంజాబ్‌ ప్రభుత్వం, ఎమ్మార్పీఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. Also Read - మహిళా నేతలపై సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు కేటీఆర్ విద్యా, ఉద్యోగ అంశాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు 7 గురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రాలకు అలాంటి అధికారం ఉండదని, పార్లమెంటు మాత్రమే ఎస్సీ, ఎస్టీ కోటాలో రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయగలదంటూ పేర్కొంటూ.. 2004లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి. ఎస్సీ వర్గీకరణ చెల్లదని పంజాబ్‌, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పంజాబ్‌ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఈ కేసులో ప్రధాన వ్యాజ్యంగా ఉన్నది. దీనితో పాటు మరో 22 పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ సమానత్వాన్నికల్పించే రాజ్యంగ అధికరణం 14కు భంగం కలిగించేలా ఉన్నదని సుప్రీంకోర్టు ఇ.వి. చిన్నయ్య కేసులో తీర్పు ఇచ్చింది. షెడ్యూల్‌ కులాల జాబితాలోకి ఏవైనా ఉప కులాలు చేర్చాలన్నా.. తొలిగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని.. రాష్ట్రాల శాసనసభలకు కాదని 2004లో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నది. తాజాగా జరిగిన విచారణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు ఉప వర్గీకరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని సుప్రీంకోర్టుకు తెలిపింది. Also Read - వయనాడ్‌ విషాదంలో 287 మంది మృత్యువాత 2004 లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉప వర్గీకరణ చేయవద్దన్న నాటి తీర్పును సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్‌ బేలా త్రివేది వ్యతిరేకించారు. ఉప వర్గీకరణకు సీజేఐతో పాటు అనుకూలంగా జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర తీర్పు ఇచ్చారు.సుప్రీం తీర్పును అనుసరించి ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని పేర్కొన్నది.

* చౌకధర దుకాణ డీలర్లు ప్రతినెల 1 నుండి 15 లోపు తప్పనిసరిగా రేషన్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు.



         చౌకధర దుకాణ డీలర్లు  ప్రతినెల 1 నుండి 15 లోపు  తప్పనిసరిగా  రేషన్  సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు.


        బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో చౌకధర దుకాణాల డీలర్లు, జిల్లా రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఎన్ఫోర్స్మెంట్  సిబ్బందితో సమావేశం నిర్వహించారు .


       సంచాలకులురేషన్ సరఫరాలో   సమయపాలన పాటించాలని ఆదేశించారు.ఎవరైనా లబ్ధిదారుల నుండి పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసినా లేదా పిడీస్ రేషన్ విషయంలో అక్రమాలకు పాల్పడిన ఆథరైజేషన్ రద్దు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


        అంతకుముందు  రైస్ మిల్లర్లతో కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్) చెల్లింపు పై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన వ్యవధి ప్రకారం సెప్టెంబర్ చివరినాటికి   2023- 24 ఖరీఫ్, అలాగే 2023- 2024 రబి  సీఎంఆర్ ను పూర్తి చేయాలని ఆదేశించారు.  ఇప్పటివరకు  

2023- 24 ఖరీఫ్ కు సంబంధించి సి ఎం ఆర్ 61 శాతం , 2023- 24 రబీ 49 శాతం పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.


            ఈ సమావేశానికి జిల్లా పౌర 

సర ఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు , ఎప్ సి ఐ డివిజనల్  మేనేజర్ సుశీల్ కుమార్ షిండే,ఎం ఎల్ ఎస్  పాయింట్ల ఇన్చార్జీలు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది,,చౌక ధర దుకాణాల 

 డీలర్లు, జిల్లా రైస్ మిల్లర్లు తదితరులు హాజరయ్యారు 

____________________________________


జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

సేవా భావం ఉన్న వారు కావాలి-కమ్మర్షియల్ వారు వద్దు* - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు పోలిశెట్టి బాలకృష్ణ వనపర్తి: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పేద ఆర్య వైశ్యులకు అందుబాటులో ఉండాలి. సేవలందించి, ఆర్యవైశ్య సత్రాల్లో తక్కువ రెట్లకు వసతి కల్పించి, సమస్యలపై స్పందించే వారు తెలంగాణ అధ్యక్షులుగా ఉండాలి. సత్రాలు వ్యాపారంగా మారాయి.సెల్ ఫోన్ చేసే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. సేవా భావం ఉండాలి. తెలంగాణలో సభ్యత్వాలు చేయించి ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. అందరి సహకారం, ప్రజా ప్రతినిధుల సహకారం అవసరం ఉన్నపుడు వాడుకోవాలి

 సేవా భావం ఉన్న వారు కావాలి-కమ్మర్షియల్ వారు వద్దు* - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు పోలిశెట్టి బాలకృష్ణ

వనపర్తి: 

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పేద ఆర్య వైశ్యులకు అందుబాటులో ఉండాలి. సేవలందించి, ఆర్యవైశ్య సత్రాల్లో తక్కువ రెట్లకు వసతి కల్పించి, సమస్యలపై స్పందించే వారు తెలంగాణ అధ్యక్షులుగా ఉండాలి. సత్రాలు వ్యాపారంగా మారాయి.సెల్ ఫోన్ చేసే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. సేవా భావం ఉండాలి. తెలంగాణలో సభ్యత్వాలు చేయించి ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. అందరి సహకారం, ప్రజా ప్రతినిధుల సహకారం అవసరం ఉన్నపుడు వాడుకోవాలి 


హైదరాబాద్‌లో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు: అడ్రస్సులు ఇవే

 హైదరాబాద్‌లో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు: అడ్రస్సులు ఇవే 

                    Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం ఆరు జోన్లల్లో వాటిని నెలకొల్పారు అధికారులు. స్థానిక సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించడంలో భాగంగా అవి అందుబాటులోకి వచ్చాయి. శుక్రగోచారంతో పాటు అద్భుతయోగం.. నేటినుండి 25రోజులు వీరి పంట పండినట్టే!! ఏ జోన్‌కు సంబంధించిన సమస్యలు ఆ జోన్ పరిధిలోనే పరిష్కారానికి నోచుకునేలా ఈ వ్యవస్థను తెర మీదికి తీసుకొచ్చింది గ్రేటర్ హైదరాబాద్. స్థానికులు తమ దరఖాస్తులను ఈ ప్రజా పాలన కేంద్రాల్లో దాఖలు చేయవచ్చు. వాటి స్టేటస్ ఏమిటనేదీ ఇక్కడి నుంచే తెలుసుకోవచ్చు. ఆయా దరఖాస్తుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కేంద్రాలను ఆశ్రయించవచ్చు. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం: ప్రధాన నిందితుడి అరెస్ట్ శేరిలింగంపల్లి జోన్.. చందానగర్ సర్కిల్- మాదాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్ వార్డు కార్యాలయాలు. శేరిలింగంపల్లి సర్కిల్- కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, వార్డు కార్యాలయాలు. రామచంద్రాపురం-పఠాన్‌చెరు సర్కిల్స్ పరిధిలో భరత్ నగర్ (పీ), ఆర్సీపురం, పఠాన్‌చెరు వార్డు కార్యాలయాలు వస్తాయి.

 సికింద్రాబాద్ జోన్..

ముషీరాబాద్ సర్కిల్: ముషీరాబాద్, అంబర్‌పేట్, బేగంపేట్, మల్కాజ్‌గిరిల్లో సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్ వార్డు కార్యాలయాలు సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. ఎల్బీ నగర్ జోన్ కాప్రా, ఉప్పల్ సర్కిల్ కార్యాలయాల్లో సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ, చంపాపేట్ వార్డు కార్యాలయాలు ఉంటాయి. హయత్‌నగర్ సర్కిల్‌లో హయత్‌నగర్, నాగోల్, మన్సూరాబాద్, బీఎన్ రెడ్డి నగర్ వార్డు కార్యాలయాలు ఉంటాయి. హయత్‌నగర్ సర్కిల్‌లో పరిధిలో- సరూర్ నగర్, ఆర్కే పురం, కొత్తపేట్, చైతన్యపురి, గడ్డిఅన్నారం వార్డు కార్యాలయాలు వస్తాయి.

ఖైరతాబాద్ జోన్.. మెహిదీపట్నం సర్కిల్ పరిధిలో- మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, విజయ్ నగర్ కాలనీ, అహ్మద్ నగర్, రెడ్ హిల్స్, మల్లేపల్లి వార్డు కార్యాలయాలు వస్తాయి. కార్వాన్ సర్కిల్‌లో కార్వాన్, జియాగూడ, లంగర్‌హౌస్, గోల్కొండ, టోలిచౌకీ, నానల్ నగర్, కార్వాన్ వార్డు కార్యాలయాలు ఉంటాయి. 

గోషామహల్ సర్కిల్- గోషామహల్, బేగంబజార్, మంగళ్‌హాట్, దత్తాత్రేయ, గోషామహల్, జాంబాగ్


వార్డు కార్యాలయాలు వస్తాయి. కూకట్‌పల్లి జోన్ మూసాపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిల్ కార్యాలయాలు కూకట్‌పల్లి పరిధిలో ఉంటాయి. స్థానికులు తమ దరఖాస్తులను ఆయా ప్రజా పాలన కేంద్రాల్లో దాఖలు చేయవచ్చు.

 చార్మినార్ జోన్.. చార్మినార్, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, ఫలక్‌నుమా సర్కిల్ కార్యాలయాలు, రాజేంద్రనగర్ డీసీ కార్యాలయం, మైలార్‌దేవ్‌పల్లి, సులేమాన్ నగర్, అత్తాపూర్, శాస్త్రీపురం, రాజేంద్రనగర్ వార్డు ఆఫీసులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి.


తెలంగాణ కొత్తజిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. త్రిపుర ప్రభుత్వంలో జిష్ణుదేవ్‌ వర్మ మంత్రిగా.. విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్థిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలు నిర్వ‌హించారు. జిష్ణుదేవ్‌ వర్మ 2018 నుంచి 2023 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వ‌ర్తించారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈయన రచయిత కూడా. ఇటీవల తన జ్ఞాపకాలను "views, reviews & my poems" పేరుతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పుస్తకంలో త్రిపుర చరిత్రకు సంబంధించిన చాలా అంశాలను జిష్ణుదేవ్‌ వర్మ ప్రస్తావించారు. https://www.teluguglobal.com/telangana/brs-call-for-protest-against-cm-revanth-reddy-1054026?infinitescroll=1 బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

 తెలంగాణ కొత్త గవర్నర్‌ జిష్ణుదేవ్‌ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

 జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు పార్టీలో చేరారు.

                        తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు జిష్ణుదేవ్ వర్మ నాలుగో గవర్నర్. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 10


రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురిని కొత్తగా నియమించగా, మరో ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఈ లిస్ట్ లో తెలంగాణ గర్నవర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ ఇన్నిరోజులు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయనను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. దీంతో కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ బాధ్యతలు చేపట్టారు.

            జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. త్రిపుర ప్రభుత్వంలో జిష్ణుదేవ్‌ వర్మ మంత్రిగా.. విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్థిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలు నిర్వ‌హించారు. జిష్ణుదేవ్‌ వర్మ 2018 నుంచి 2023 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వ‌ర్తించారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈయన రచయిత కూడా. ఇటీవల తన జ్ఞాపకాలను "views, reviews & my poems" పేరుతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పుస్తకంలో త్రిపుర చరిత్రకు సంబంధించిన చాలా అంశాలను జిష్ణుదేవ్‌ వర్మ ప్రస్తావించారు.


మైనింగ్‌ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

               


                మైనింగ్‌ శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

                     అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వనరులపై ఈ సమావేశంలో చర్చించారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలపై సమీక్షించారు. ఒప్పందాల ద్వారా అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి నష్టం జరిగిందని గుర్తించారు. గడచిన ఐదేళ్లలో మైనింగ్ శాఖ ఆదాయం 7 శాతమేనని నిర్ధారించారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు చెల్లింపులు చేయలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వానికి రూ.1,025 కోట్లు చెల్లించలేదని వెల్లడించారు. అక్రమాలపై కేసులు నమోదు చేశామని సీఎంకు వివరించారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల సమస్యలు తలెత్తాయని తెలిపారు.

నేటి సమావేశంలో… ఉచిత ఇసుక పాలసీ అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపై సమీక్షించారు. రవాణా ఖర్చుల వల్ల కొన్ని చోట్ల తక్కువ ధరకు ఇసుక దొరకని అంశంపైనా చర్చించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా ఎలా వెళ్లాలనే అంశంపై కూడా సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. అవసరం ఉన్న వారు రీచ్ నుంచి నేరుగా ఇసుక తీసుకెళితే భారం ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇసుక వినియోగదారులకు భారం కారాదని అధికారులకు నిర్దేశించారు.

కండకావరంతో ఆడబిడ్డలను అవమానించారు.. సీఎంపై కేటీఆర్‌ మండిపాటు..

KTR | కండకావరంతో ఆడబిడ్డలను అవమానించారు.. సీఎంపై కేటీఆర్‌ మండిపాటు..

 

KTR | నోరు జారితే ఎవరైనా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని.. కానీ కండకావరంతో ఆడబిడ్డలను అవమానించారంటూ సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల రామారావు మండిపడ్డారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన సీఎం రేవంత్‌పై ఆయన నిప్పులు చెరిగారు.

KTR | నోరు జారితే ఎవరైనా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని.. కానీ కండకావరంతో ఆడబిడ్డలను అవమానించారంటూ సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల రామారావు మండిపడ్డారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన సీఎం రేవంత్‌పై ఆయన నిప్పులు చెరిగారు. మా మహిళా శాసనసభ్యులపై అకారణంగా సీఎం నోరుపారేసుకున్నారన్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఈ అవమానం కేవలం సబితక్కకు, సునీతక్కకు జరిగింది కాదని.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల 

మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. రేవంత్‌ సీఎం పదవికి అన్‌ఫిట్‌ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని.. ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు అన్నారు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవారని.. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కారని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌ గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని.. బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయమన్నారు.

ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చిర్రు భట్టి గారు అంటూ ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా? అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడామని అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నామని.. అది తమకు కేసీఆర్ నేర్పించిన సంస్కారమని తెలిపారు. అసెంబ్లీలో ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమని.. ముఖ్యమంత్రి సిగ్గు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకో అంటూ హితవు పలికారు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ అంటూ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు.

 

TG Rains | తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్‌..!

TG Rains | తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్‌..!

TG Rains | తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

TG Raiతెలంగాణరాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాగల మూడురోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది.

ఇక ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో గాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆగస్టు 3న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.


7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..! 7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. నేడు కీలకమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. జూలై 2024కి సంబంధించిన డీఏను జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా పెంచుతారు. ఈ డేటాను ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తుంది. ఈ డేటా రిలీజ్ అయితే డీఏ పెంపుపై క్లారిటీ వస్తుంది. బడ్జెట్ తరువాత డీఏ పెంపు ఎంత ఉంటుందోనని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!

                               : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. నేడు కీలకమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. జూలై 2024కి సంబంధించిన డీఏను జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా పెంచుతారు. ఈ డేటాను ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తుంది. ఈ డేటా రిలీజ్ అయితే డీఏ పెంపుపై క్లారిటీ వస్తుంది. బడ్జెట్ తరువాత డీఏ పెంపు ఎంత ఉంటుందోనని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో 4 శాతం డీఏ పెరిగింది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది.

/8

6 నెలల AICPI సూచిక సంఖ్యల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతుంది. ఇప్పటివరకు మే నెలకు సంబంధించిన AICPI డేటా ఉంది. 

/8

రానున్న ఆరు నెలల ద్రవ్యోల్బణం రేటు మార్పులను బట్టి వినియోగదారుల ధరల సూచిక (CPI) నెలవారీ డేటాను రిలీజ్ చేస్తారు. ద్రవ్యోల్బణం AICPIలో హెచ్చుతగ్గులతో ముడిపడి ఉంటుంది.   

/8

AICPI ప్రతి నెలా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఆర్థిక మార్పులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగులకు వేతనాలను నిర్ణయించేందుకు ఈ డేటాను రూపొందిస్తారు.  

/8

మే నెల వరకు ఉన్న AICPI డేటా, అధిక ద్రవ్యోల్బణం ఆధారణంగా డీఏ 4 శాతం లేదా 5 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డీఏ 54 నుంచి 55 శాతానికి చేరే అవకాశం ఉంది. ఈరోజు జూన్ ఏఐసీపీఐ లెక్కలు వస్తే డీఏ పెంపుపై స్పష్టత వస్తుంది.    

/8

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.      

శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ సమస్యకు చెక్ పడినట్లే!

Tirumala: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ సమస్యకు చెక్ పడినట్లే!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో టీటీడీ అడుగులు వేస్తోంది. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు.. తిరుమలలోని హోటళ్లు, క్యాంటీన్లకు టీటీడీ ఈవో కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యర్థాల నిర్వహణ కోసం రెండు బిన్ల విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,డీల్స్ చూడండి

  • తిరుమల వెంకన్న దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. శ్రీవారి అన్న ప్రసాదం దగ్గర నుంచి క్యూలైన్ల నిర్వహణ వరకూ ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా తిరుమల కొండను పరిశుభ్రంగా ఉంచేందుకు టీటీడీ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని పెద్ద, చిన్న హోటళ్లు సహా తినుబండారాలను విక్రయించే ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణకు రెండు చెత్త బిన్ల వ్యవస్థను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భక్తుల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించేందుకు ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Samayam TeluguTirumala


ఏపీటీడీసీ హోటళ్లు, జనతా క్యాంటీన్లపై తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు తడి, పొడి చెత్త విధానాన్ని అనుసరించాలని సూచించారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. హోటల్ యజమానులు కూడా తన హోటల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆహార పదార్థాల ధరలతో బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఆహార పదార్థాలలో నిషేధిత రంగులను ఉపయోగించకూడదని ఈవో స్పష్టం చేశారు. 12 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారికి టేస్ట్ ఎన్‌హేన్సర్‌తో తయారుచేసిన ఆహార పదార్థాలు ఇవ్వకూడదని ఈవో ఆదేశించారు. అలాగే లైసెన్స్ పొందిన నిర్వాహకులు ఎలాంటి సబ్ లీజులు ఇవ్వకూడదని ఆదేశించారు.
ఇక జనతా క్యాంటీన్లు కూడా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలోని హోటళ్ల వారికి ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆగస్ట్ 5 నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తామని ఈవో తెలిపారు. అలాగే క్యాంటీన్లు, హోటళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని.. మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు.