Tuesday, 15 August 2023

★అంగరంగ వైభవంగా IVF నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం!*

 ★అంగరంగ వైభవంగా IVF నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం!*


















*ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) నల్లగొండ జిల్లా నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, నేషనల్ సెక్రటరీ & తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*
ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్ లోని రవీంద్రనగర్,చిన వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) నల్లగొండ జిల్లా నూతన కమిటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మరియు నల్లగొండ డివిజన్ నూతన కమిటీ , నల్లగొండ జిల్లా యూత్ నూతన కమిటి , నల్లగొండ జిల్లా మహిళ నూతన కమిటి , నల్లగొండ మండల నూతన కమిటి & నల్లగొండ పట్టణ నూతన కమిటి ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి *ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు,నేషనల్ సెక్రటరీ & తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు...విచ్చేశారు.* ఈ కార్యక్రమంలో భాగంగా.. వాసవిమాత చిత్ర పటానికి,పూలమాల వేసి పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా..ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్,కారు లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఈ సందర్భంగా.. పట్టణంలో టపాసులు పేల్చుతూ..స్లొగన్స్ ఇస్తూ, 500 బైక్ లతో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది.
*ఈ సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-IVF నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి గారు, ప్రధాన కార్యదర్శి నూనె కిషోర్ బాబు, కోశాధికారి గోవిందు బాలరాజు, జిల్లా యువజన విభాగం, జిల్లా మహిళా విభాగం మరియు వివిధ విభాగాల నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.* ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారిని గజ మాలతో సత్కరించినారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త - స్వప్న దంపతులను శాలువాలతో సన్మానించడం జరిగింది
తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు..
*ఈ సందర్భంగా నల్లగొండ గౌరవ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ...* బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా ఉందని తెలంగాణ ఆవిర్భవించిన నాటినుండి నేటి వరకు తెలంగాణ దేశంలోనే అన్ని రంగాలలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని గణనీయమైనటువంటి మౌలిక సదుపాయాలను రూపొందించుకున్నామని దేశంలోనే అత్యధిక మెడికల్ కాలేజీలు కలిగి ఉన్న రాష్ట్రమని విద్య వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నామని అన్నారు.
అదేవిధంగా ఈరోజు దేశంలోనే కరెంటును నిరంతరాయంగా నిర్విరామంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికీ దేశంలో కరెంటు లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయని మరి తెలంగాణ ఏర్పడ్డాక చాలామంది అవహేళన చేశారని కానీ వారందరినీ సవాల్ చేస్తూ నేడు తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడిందని ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యం అయిందని తెలియజేయడం జరిగింది. అన్నారు, ఆర్యవైశ్యులు కూడా సామాజిక సేవలో మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.ఆర్యవైశ్యుల చిరకాల కోరిక వైశ్య కార్పొరేషన్ కూడా రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరి మన నల్లగొండ నియోజకవర్గాన్ని 5 ఏళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దినామని ఇందులో రెండు సంవత్సరాలు కరోన లో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా నేడు కాలంతో పోటీ పడి అభివృద్ధి ని చేశామని అన్నారు
*ఈ సందర్భంగా టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ..* సీఎం కేసీఆర్ గారి పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగింది అన్నారు. ముఖ్యంగా 77 ఏండ్ల స్వాతంత్ర్య దేశంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్య జాతికి గుర్తింపు, గౌరవం దక్కింది. ఆర్యవైశ్యులకు న్యాయం జరిగింది.అని అన్నారు.రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి ప్రాముఖ్యత ఇచ్చింది. న్యాయం చేసింది, సీఎం కేసీఆర్ గారు ఒక్కరు మాత్రమే.. ఉప్పల్ భాగాయత్ లో 5 ఎకరాల భూమిని కూడా ఇచ్చారని, రాజకీయంగా కూడా ఆర్యవైశ్యుల కు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని అన్నారు.ఎటువంటి పదవులు ఇచ్చినా నీతి నిజాయితీ తో కష్టపడి పని చేస్తారని అన్నారు. సిద్దిపేట ముద్దుబిడ్డ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోటి రూపాయలు ఇచ్చి అయినా కోమట్లతో సోపతి చేయమని అన్నారని గుర్తుచేశారు.అన్ని కులాలు,మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఒక్క ఆర్యవైశ్య కులానికి మాత్రమే ఉంటుంది అన్నారు. చెప్పారు. అన్ని కులాలు, బాగు కోసం కృషి చేస్తున్న ఆర్యవైశ్య జాతి పేదల కోసం మాట ఇచ్చి ఉన్నందున, వారు మాట తప్పరని, త్వరలోనే వైశ్య కార్పొరేషన్ కూడగౌరవ సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో సాకారం కావడం ఖాయమని భావిస్తున్నానని అన్నారు.ముఖ్యంగా ఆర్యవైశ్యులకు 4 గురుకి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు.. 11 మందికి మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒకరికి ఎమ్మెల్సీ పదవి, ఒకరికి ఎమ్మెల్యే పదవి, ఒకరికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా అవకాశం దక్కింది అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతున్నది.ఆర్యవైశ్య పేదలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. *కేసీఆర్ గారి నాయకత్వం లో* రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. గతంలో పవర్ హాలిడేస్, కరెంట్ కోతలు ఉండేవి. ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తూ రాష్ట్రంలో వర్తక వ్యాపారులు అందరూ ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
*ఈ కార్యక్రమంలో..* IVF స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, కోశాధికారి కోడిప్యాక నారాయణ, పట్టణ కౌన్సిలర్ యామ కవిత, IVF ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, IVF స్టేట్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్య లక్ష్మి, సెక్రటరీ మిడు దొడ్డి శైలజా, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా IVF తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్,తెలంగాణ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కొల్పురి నరేష్ గుప్త , IVF రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజినీకాంత్, ఉపాధ్యక్షుడు జూలకంటి రవీందర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు సంబు పాండయ్య, మీడియా చైర్మన్ కోటగిరి దైవాదీనం,మెంబెర్ షిప్ చైర్మన్ తాళ్లపల్లి రాము, IVF ఆధ్యాత్మిక చైర్మన్ బోనగిరి శ్రీనివాస్,టూరిజం కమిటీ చైర్మన్ పరమేష్, సీనియర్ నాయకుడు L. V. కుమార్,మరియు మహిళా అడ్వైసర్ కమిటీ సభ్యులు మరియు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని విభాగాల సభ్యులు,మహిళలు,ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment