Friday, 11 August 2023

గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు బీఎస్పీ పిలుపు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్, ఇంట్లోనే దీక్ష ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్

 గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు బీఎస్పీ పిలుపు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్, ఇంట్లోనే దీక్ష

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ 



RS Praveen Kumar : తెలంగాణ గ్రూప్-2 వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోనే ప్రవీణ్ కుమార్ దీక్ష చేస్తున్నారు.

RS Praveen Kumar : తెలంగాణ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద శాంతి యుతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో గ్రూప్-2 అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పరీక్ష వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతిపత్రం అందజేశారు. గురుకుల టీచర్, పాలిటెక్నిక్‌ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు పూర్తైన తర్వాత గ్రూప్‌- 2 పరీక్ష నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు రావడంతో ప్రిపేర్ కావడానికి టైం సరిపోవడవంలేదని గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. అందుకే టీఎస్పీఎస్సీని ముట్టడించారన్నారు.

ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు శుక్రవారం అర్థరాత్రి హౌస్ అరెస్ట్ చేశారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ ఇవాళ గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్ కుమార్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను చూసేందుకు వస్తున్న బీఎస్పీ నాయకులను, కార్యకర్తలను లోపలికి అనుమతించడం లేదు. పోలీసుల తనను బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో... ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. తెలంగాణ గడ్డ కేసీఆర్ లాంటి నియంతలను ఎంతో మందిని చూసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్ 2 వాయిదా వేసే వరకు తమ పోరాటం కొనసాగుతోందన్నారు.


కేసీఆర్ తాటాకుల చప్పుళ్లకు భయపడే సవాలే లేదు

"ఇప్పుడే 5 మంది పోలీసు ఉన్నతాధికారులు వచ్చి కేసీఆర్ ప్రభుత్వం నన్ను గృహనిర్బంధంలోనే ఉంచమని ఆదేశాలిచ్చిందని చెప్పిపోయిండ్రు. తెలంగాణ గడ్డ కేసీఆర్ లాంటి నియంతలను ఎంతో మందిని చూసింది. ఈ తాటాకుల చప్పుళ్లకు భయపడే సవాలే లేదు. శనివారం నేను నిరుద్యోగ బిడ్డల కోసం సత్యాగ్రహాన్ని ఇంట్లోనే కొనసాగిస్తాను. తెలంగాణ ప్రజలందరూ ఈ నిరంకుశ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఎక్కడ ఉన్నా పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన తెలపగలరని కోరుతున్నా. నన్ను అరెస్టు చేయడానికి పోలీసులను బీఎస్పీ ఆఫీసు, ఇంటి చుట్టు మొహరించే బదులు, ఒక్కసారి లక్షలాది నిరుద్యోగ బిడ్డల తీవ్రమైన మనోవేదనను అర్థం చేసుకోండి. వాళ్లు పరీక్ష రాయం అని అంటలేరు. కొంచెం వాయిదా వేయమంటున్నారు. అది చేస్తే ప్రభుత్వానికొచ్చే నష్టం ఏంలేదు. పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో రాయాలి. ఆందోళనతో, ఒత్తిడిలో రాయవద్దు. మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నడిచిన పాలకులందరూ చరిత్రలో మట్టికరచిండ్రు"- ప్రవీణ్ కుమార్

No comments:

Post a Comment