Friday, 18 August 2023

*మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్*

*మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్*

నల్గొండ పట్టణం ఎస్.ఎల్.బి.సి.వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ పరిశీలించారు.
మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో క్లాస్ రూం ల్లో కలియ తిరిగి పనులు పరిశీలించారు,పురుషుల,మహిళల హాస్టల్ ల భవన నిర్మాణ పనులు పరిశీలించారు.117 కోట్ల రూ. ల వ్యయం తో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను 6 బ్లాక్ లుగా నిర్మిస్తున్నట్లు,నాలుగు బ్లాక్ లు జి+3 ,రెండు బ్లాక్ లు జి+2 భవనా లు గా నిర్మిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ డి. ఈ. లోక్ లాల్  కలెక్టర్ కు వివరించారు.
ప్రిన్సిపాల్ క్వార్టర్,గెస్ట్ హౌజ్ భవనం జి+3 గా నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఫస్ట్ ఫ్లోర్ లో ప్రిన్సిపాల్ క్వార్టర్,రెండవ,మూడవ ప్లోర్ లో
రెండు గెస్ట్ హౌజ్ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్  గ్రౌండ్ ఫ్లోర్ లో
కారిడార్,రూమ్స్ ఫ్లోరింగ్ పనులు పూర్తి అయినట్లు,ప్రతి రోజూ 450 మంది వర్కర్  లతో పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు వివరించారు.పురుషుల హాస్టల్ జి+4,మహిళల హాస్టల్ జీ+5 ఫ్లోర్  లుగా నిర్మిస్తున్నట్లూ తెలిపారు.
మెడికల్ కళాశాల భవన  నిర్మాణ పనులు   2024 మార్చి వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లా కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రాజ కుమా రి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,డి.సి.హెచ్.ఎస్. డా.మాతృ,తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ డి. ఈ లోక్ లాల్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment