Friday, 11 August 2023

కధం త్రొక్కనున్నా తెలంగాణ వైశ్యలు

 కధం త్రొక్కనున్నా తెలంగాణ వైశ్యలు


ఉద్యమకారుడు  డా: కాచం సత్యనారాయణ గారు స్థాపించిన వైశ్య వికాస వేదిక

బ్యానర్ పై వైశ్యలు ఆత్మ గౌరవం ( హుక్కుల సాధనకై ఛర్ఛా గోష్టి)  అని సుతి మెత్తని  పదాలతో  పదునైన సమావేశాలు  నిర్వహిస్తూ, 

ఉన్నత చదువులు చదివిన  ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విలేకరులు,డాక్టర్లు , ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగులాంటి   యువతను  సమావేశ పరిచి వారి అమూల్యమైన సలహాలు సూచనలు తీసుకొనుచూ , రాజకీయ నిపుణుల మార్గదర్శకాల్లో  తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో సమావేశం నిర్వహిస్తూ, వైశ్యులందరిని సంఘటితం చేస్తూనే ఎవ్వరు ఊహించని విధంగా నగరం నడిబొడ్డున   లక్ష మందితో  వైశ్య గర్జన ఏర్పాటు   చేయనున్నట్లు గోడ పత్రికను  ఆవిష్కరిస్తూ ప్రకటించడంతో , మర్రిచెట్టు లాంటి సంఘాలు ఉలిక్కి పడ్డాయి. వాస్తవానికి రాజకీయ అనుబాంబు  అనే చెప్పాలి  ఈ వార్తా. 

కేవలం  వైశ్య విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలనే తపన తో స్థాపించిన ఈ వైశ్య వికాస వేదిక

 ధినధినాభివృద్ధి చెందుతూ  వేలమంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేస్తూ , ఉపాద్యాయులకు పురస్కారాలు ఆందిస్తూ,  600 మండలాలో గల వైశ్యుల గుండెళ్ళో  నిలిచిన  కాచం

పలు ట్రేడ్ యూనియన్లకు అద్యక్షత వహిస్తూ,  సహాయం అందించి  మన్ననలు పొందారు.

 వికాస వేదిక  బ్యానర్ ద్వారా  ఆర్థికముగా వెనుక బడిన వైశ్య విద్యార్థులకు  ధన సహాయం తో పాటు స్టడిమెటీరియల్, మహిళలకు కుట్టు మిషన్లు, వివిధ సందర్భాలలో పలు ప్రాంతాల్లో బోజనవసతులతో పాటు   కరోనా సమయంలో  వైద్య సేవలలో భాగంగా అంబులెన్స్, ఆక్సిజన్ యంత్రాలు, బాటసారులకు,    గుడిసే  వాసులకు  బోజనాలు... ప్రహర  నిర్వహిస్తున్న  రక్షక భటులకు  పౌష్టికాహారం అందించడం తో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించి        కాచం అన్న అందరివాడు

 ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు  అని ముద్ర పడిన విషయం తెల్సిందే... 

 తెలంగాణ ఉద్యమంలో ఆటుపోటులు  అనుభవించి,వందల కేసులు పెట్టిన వెనుకాడకుండా, ఉపాధ్యాయ పదవిని వదులుకొని, తెలంగాణ వైశ్య జాతికి వన్నేతెచ్చిన కాచం

  డా: కాచం సత్యనారాయణ గారి అర్ధాంగి   కాచం సుష్మా గారు కూడా   తెలంగాణ ఉద్యమంలో భర్తకు  తగ్గ భార్య లాగా తనదైన శైలిలో  ఉద్యమం లో పాలు పంచుకొనుచూ...  కల్వకుంట్ల కవిత గారితో కలిసి పలు ప్రాంతాల్లో భారీగా బతుకమ్మ సంబరాలు నిర్వహించి.. మహిళా లోకానికి.. సంఘాలకు , పార్టీకి చేరువయ్యారు. అందుకే నేటికి కల్వకుంట్ల కవిత గారితో మంచి చనువు కలదు.  కాచం గారికి 

ఉద్యమాల ద్వారా దైర్య సాహసాలతో పాటు, అతని విద్యార్హతలు 

జర్నలిజంలో,ఉపాద్యాయ వృత్తిలో, న్యాయశాస్త్రంలో   పట్టభద్రులై నందున అతనికి అన్ని రంగాల్లో మంచి పట్టు గలదు.   వైశ్యులుపై కంచే  ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను  ( TV  ఛర్ఛలలో)    ఘాటుగా విమర్శించారు ... చాలెంజ్ గా తీసుకోని వారం రోజుల లోనే వైశ్యలు సామాజిక సేవకులు అనే పుస్తకం రచించి, ప్రచురించి   రచయిత ఐనారు.ఆ చురుకు తనంతోనే  వైశ్యులలో  ఎవ్వరికి లేనంతగా  

అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులతో,పలు ట్రేడ్ యూనియన్ల తో, వివిధ రంగాల్లో గల నిపుణులతో సత్సంబంధాలు కలవు.  అందుకే ఈ వైశ్య గర్జన విజయవంతం చేయడం      డా: కాచం సత్యనారాయణ గారికి సులభతరం  అని  పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.... మీ బుక్కాఈశ్వరయ్య...✍️

No comments:

Post a Comment