Sunday, 13 August 2023

స్త్రీ హస్తిన మహిళా మండలి మరియు జాగృతి పర్యావరణ పరిరక్షణ






 హైదరాబాద్ వనస్థలిపురం, వెంకటేశ్వర స్వామి దేవాలయం లో *స్త్రీ హస్తిన మహిళా మండలి మరియు జాగృతి పర్యావరణ పరిరక్షణ* సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా *_IVF - ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు_* పాల్గొని, కార్యక్రమంను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా *పర్యావరణ పరిరక్షణలో నా పాత్ర* అనే కార్యక్రమం పై స్వీయ విశ్లేషణ/ అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఆన్లైన్ లో ఆగస్టు ఒకటి నుంచి తొమ్మిది వరకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్,తర్డ్ ప్రైజ్,ప్రకటించారు.
*తదనంతరం ఈ సందర్భంగా టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ..* పర్యావరణ పరిరక్షణ కోసం
మన తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కు -హరితహారం లాంటి చాలా గొప్ప కార్యక్రమం చేపట్టి,కోట్లాది మొక్కులు నాటడం జరిగింది అని అన్నారు.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని భగీరథ ప్రయత్నం లా కొనసాగిస్తున్నారు చాలా అభినందనీయం వారు చేస్తున్న కృషికి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే
పర్యావరణం రాను రాను క్షిణిస్తోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది..అన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని,వాట్సాప్ ద్వారా పంపియాలని గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
*ఈ కార్యక్రమంలో..* భావన శ్రీనివాస్ మరియు డాక్టర్ పూర్ణశాంతి , లక్ష్మి , ఇస్మాయిల్ వెంకట్రావు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Todas las reacciones:
12

No comments:

Post a Comment