Wednesday, 30 August 2023

పెంచిన వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలి*




*పెంచిన వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలి*


*పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి*

*4న మండల ఆఫీసు ముందు ధర్నా*.              మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను చెల్లించుటకు బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని, మరియు పెండింగ్ బిల్లును తక్షణమే చెల్లించాలని *సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం  జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ* లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

             బుధవారం స్థానిక నల్లగొండ దేవరకొండ రోడ్డులో గల బాలుర ఉన్నత పాఠశాల లో కార్మికులతో కలసి సమస్యలకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 మార్చి 15న గౌరవ ముఖ్యమంత్రి  అసెంబ్లీలో మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై అదనంగా రూపాయలు 2000/ పెంచుతున్నట్లు ప్రకటించారు. యూనియన్ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జీవో ఎంఎస్ నెంబర్ 8 ని విడుదల చేసింది కానీ కార్మికులకు పెరిగిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వలేదని కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన వేతనాలకు బడ్జెట్ కేటాయించి చెల్లించాలని, పెండింగ్ బిల్లులు గుడ్లకు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని జూలై 10,11,12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మె చేసి జూలై 14 తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని సమ్మె నోటీసు ఇచ్చిన ఫలితంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి  2023 జూలై 15న ప్రెస్ మీట్ పెట్టి పెరిగిన వేతనం జూలై నెల నుండి చెల్లిస్తామని పెండింగ్ బిల్లులు కూడా వారం రోజుల్లో క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా ఆచరణలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అందుకని మరో మారు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం మంత్రిని  కలిసిన చెల్లిస్తామని వాగ్దానం చేశారే తప్ప ఆచరణలో అమలు కావడం లేదని కాలయాపన చేస్తూ కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది సరైన కాదని సూచించారు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పెరిగిన వేతనం చెల్లించేందుకు బడ్జెట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి వంటలు చేసి పెట్టి  తెచ్చిన దగ్గర వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందుల పాలవుతున్నారని ఇప్పుడున్న మెనూ కేటాయించిన బడ్జెట్ సరిపోవటం లేదు కొత్త మెనూ పెట్టడానికి బడ్జెట్ కేటాయించి ఒక్కొక్క విద్యార్థికి స్లాబ్ రేటు 25 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలన్నారు కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వంటకు సరిపడా గ్యాస్ను సబ్సిడీపై ఇవ్వాలని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా గుడ్లు సరఫరా చేయాలని ప్రమాద బీమా పి ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లను మరియు పెరిగిన వేతనం సాధన కోసం ఇతర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 4వ తేదీన అన్ని మండల కేంద్రాలలో మరియు సెప్టెంబర్ 13వ తేదీ చలో కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలకు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.


*ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు కోయగూర పద్మ అలివేలు సైదమ్మ వెంకటమ్మ రామణా తదితరులు పాల్గొన్నారు*


No comments:

Post a Comment