Tuesday, 8 August 2023

ఆర్టీసీ ప్రయాణీకుల దర్శన టికెట్ల కోటాపై టీటీడీ కీలక నిర్ణయం..!!

 ఆర్టీసీ ప్రయాణీకుల దర్శన టికెట్ల కోటాపై టీటీడీ కీలక నిర్ణయం..!! 


Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు దర్శనానికి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న టీటీడీ ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి తిరుమల చేరుకొనే భక్తుల కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణీకులకు దర్శన కోటా కేటాయించింది. ఇప్పుడు వారికి అందించే దర్శన టికెట్ల కోటాను మరింత పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. టికెట్ల కోటా పెంపు:ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి తిరుమలకు చేరుకొనే వారికి అందించే దర్శన టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. ఇప్పటి వరకు రోజూ ఆర్టీసీ ప్రయాణీకులకు రాష్ట్ర వ్యాప్తంగా 600 టికెట్లు ఇస్తుండగా తాజాగా ఆ సంఖ్యను 1000కు పెంచింది. బస్సు ఛార్జీకి తోడు శ్రీవారి దర్శనానికి రూ 300 దర్శన టికెట్లను ప్రయాణీకులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బుక్ చేసుకొనే టికెట్లు ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ లోపు ప్రయాణం, దర్శనానికి ఉపయోగపడతాయి. 

         వెయ్యి మందికి అవకాశం:ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.apsrtconline.in లో అదనపు కోటా టికెట్ల బుకింగ్ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా ఆర్టీసీ బస్సుల్లో తిరుమల చేరుకొనే ప్రయాణీకులకు మరింతగా శ్రీవారి దర్శనంలో అవకాశం దక్కనుంది. ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసి నుంచి వచ్చిన వినతుల మేరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణీకులకు ప్రతీ రోజు వెయ్యి మందికి రూ 300 శీఘ్ర దర్శనం టికెట్లు అందిస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల ద్వారా తిరుమల చేరుకొనే ప్రయాణీకులకు ప్రాధాన్యత దక్కనుంది. Chandrayaan-3: చంద్రయాన్ -3 అప్ డేట్- వైఫల్యమే పాఠంగా-సాఫ్ట్ ల్యాండింగ్ కు జాగ్రత్తలు.. Recommended Video పుంగనూరు లో చంద్రబాబు రెక్కీ.. టీటీడీ వరుస నిర్ణయాలు:కాగా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజూ వెయ్యి రూ.300 శీఘ్ర దర్శనం టికెట్లు అందిస్తున్నారు. ఇందుకుగాను బస్సు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించాలి. వీరి కోసం ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం స్లాట్లు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో భక్తులు తిరుమల బస్‌స్టేషన్ చేరుకున్న అనంత‌రం.. శీఘ్ర దర్శనం చేసుకునేందుకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయ‌ం అందిస్తారు. అదే సమయంలో తిరుమలకు కొన్ని డిపోల నుంచి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ఆర్టీసీ అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీలో తిరుమలకు చేరుకొనే ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


No comments:

Post a Comment