అర్హులైన వారందరికీ రుణాల పంపిణీలో ఆర్.పి ల పాత్ర కీలకం - మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
*హైదరాబాద్, ఆగస్టు 28:* మహిళాలకు ఆర్థిక చేయూత అందించే పలు రకాల రుణాలు అర్హులైన వారందరికీ పంపిణీలో ఆర్.పి ల పాత్ర కీలకమని అందుకు వారికి డ్రెస్ కోడ్ ను అమలు చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్ సి.ఎం.టి.ఐ.ఎస్ లో సోమవారం అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం అడిషనల్ కమిషనర్, ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ లతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమీక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సాధికారతకు తోడ్పాటు అందించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు కాకుండా సీనియర్ సిటిజెన్లకు, వివిధ ప్రతిభావంతులు (దివ్యాంగుల)కు అందించే సహాయం లక్ష్యాన్ని మించి అందించేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా స్ట్రీట్ వెండర్స్ కు నగరంలో అందించిన పీఎం స్వానిధి అమలులో జిహెచ్ఎంసి కి మంచి గుర్తింపు రావడం జరిగిందని, అదే విధంగా యు.సి.డి విభాగం ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలు కూడా మంచి గుర్తింపు తేవాలని ఆమె కోరారు.
దానం నాగేందర్ మాట్లాడుతూ... మహిళలు ఆర్థిక శక్తి, బ్యాంకు రుణాలు కాకుండా వివిధ విభాగాలలో భాగస్వామ్యాన్ని కల్పించాలని కోరారు. కాలనీలో పచ్చదనం నిర్వహణకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన జిహెచ్ఎంసి కి బాగా పేరు వచ్చినట్లు తెలిపారు.
అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ఆర్థిక సంవత్సరం నగరంలో 1713 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 48,564 మంది సభ్యులతో కూడిన 515 గ్రూపు లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం ఈ సమావేశంలో సోమవారం ఉదయం రాంకోఠిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కాలేజ్ బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు సునీత మరణించిన సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సమావేశంలో డి.సి ప్రశాంతి పి డి సౌజన్య, పి డి లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment