Sunday, 27 August 2023

*హైదరాబాద్ లో ఘరానా మోసం..మనిషి ప్రాణాలతో చెలగాటం...పేస్టు కాదు.. వేస్ట్.! కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెలుగుచూసిన భయానక విషయాలు.*

 *హైదరాబాద్ లో ఘరానా మోసం..మనిషి ప్రాణాలతో చెలగాటం...పేస్టు కాదు.. వేస్ట్.! కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెలుగుచూసిన భయానక విషయాలు.*


శవ శంకర్. 

అబ్బోచికెన్ ,మటన్ ,కోడిగుడ్డు కూర బలే రుచిగా ఉంది....అబ్బో పలావు బలే టెస్ట్ గా ఉంది... అని లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాం...టెస్ట్ రావాలంటే ముందుగా కావాల్సింది అల్లం,వెల్లుల్లి పేస్ట్... ఇది ఇంట్లో చేసుకుంటే ఒకే...*


*బయట అల్లం,వెల్లుల్లి పేస్ట్ కొన్నారా..మన ఆయుస్సుచేతులారా మనం తగ్గించుకునట్టే...ఏంటి అంటారా..అయితే ఈ స్టోరీ చదవాల్సిందే*




కూరలో అయినా అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా వేస్తుంటాం. అల్లం వెల్లుల్లి లేని మసాలా వంటకం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకున్న ఓ ముఠా మనుషుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. విచ్చల విడిగా కల్తీ ఆహారపదార్ధాలను తయారు చేస్తూ మార్కెట్లో చెలామణి చేస్తున్నారు. 


తాజాగా మరోసారి హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ బయటపడింది.



 రాజేంద్రనగర్‌ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న కల్తీ అల్లం పేస్టు తయారీ గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఉప్పరపల్లిలో ఒక మారుమూల ప్రదేశంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌను ఏర్పాటు చేశారు. ఉప్పరపల్లిలో దిల్దార్ అనే వ్యక్తి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తూ పెద్ద ఎత్తున మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న SOT పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేశారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అల్లం పేస్టును తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కెమికల్స్‌తో పాటు యాసిడ్‌, కుళ్లిపోయిన పేస్టును ప్యాకింగ్‌ చేసి ఎక్స్‌పైరీ డేట్‌ మార్చి అమ్ముతున్నట్టు దాడుల్లో బయటపడింది. ఈ దాడుల్లో 4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్‌ చేశారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కల్తీ ఆహార పదార్ధాలను తయారు చేస్తున్న ముఠాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో చీప్‌గా దొరుకుతుంది కదా అని ఏడితే దాన్ని కొనుక్కోవద్దని సూచిస్తున్నారు అధికారులు. కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్నారు దుర్మార్గులు.

No comments:

Post a Comment