Tuesday, 1 August 2023

దివ్యాంగులకు మరో కానుక..! గృహలక్ష్మి పథకంలో రిజర్వేషన్లు..! ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!

 

Gruhalakshmi Scheme | 

దివ్యాంగులకు మరో కానుక..! గృహలక్ష్మి పథకంలో రిజర్వేషన్లు..! ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!

 

Gruhalakshmi Scheme | దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే రూ.3లక్షలు అందించనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన వచ్చింది. అయితే, ఈ పథకంలో దివ్యాంగులకు ఐదుశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది

Gruhalakshmi Scheme | దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే రూ.3లక్షలు అందించనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన వచ్చింది. అయితే, ఈ పథకంలో దివ్యాంగులకు ఐదుశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర దివ్యాంగులాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి సీఎం కేసీఆర్‌కు కలిసి విజ్ఞప్తి చేయగా.. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారని, ఆయనకు దివ్యాంగుల సమాజం రుణపడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులు సంతోషంగా ఉన్నారని, సొంతింటి కల నెరవేరినట్లుగా భావిస్తున్నారన్నారు. దివ్యాంగుల్లో ఆత్మగౌరవం, విశ్వాసం పెరిగిందన్నారు.

Loaded0.65%
Remaining Time 10:00

ఎస్సీ, ఎస్టీ బీసీలకు కూడా..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే పేదల కోసం గృహలక్ష్మి పథకంలో భాగంగా రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు సైతం కేటాయించింది. గృహలక్ష్మి పథకం కింద 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. 4లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించనుండగా.. మరో 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో అనుమతి ఇవ్వనున్నారు. పథకం కింద లబ్ధిదారులకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మూడు దఫాలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం.. ఈ మేరకు బడ్జెట్‌ను నిధులను సైతం కేటాయించింది. పథకానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ను అమలుచేయాలని ఆదేశించింది.

No comments:

Post a Comment