Monday, 14 August 2023

భారతదేశ పతాక గీతం రచయిత..

 భారతదేశ పతాక గీతం రచయిత...

శ్యామ్‌లాల్ గుప్త ఒక భారతీయ కవి మరియు గేయ రచయిత. పర్షద్ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందారు. శ్యామ్‌లాల్ గుప్త 9 సెప్టెంబర్ 1896న కాన్పూర్‌లోని నార్వాల్‌లోని దోసర్ వైశ్య కమ్యూనిటీలో జన్మించారు. వీరి తండ్రి విశేశ్వర్ ప్రసాద్, తల్లి కౌసల్యా దేవి. 

                                  1948 హిందీ చలనచిత్రం ఆజాదీ కి రాహ్ పర్ లో ఆయన వ్రాసిన పాట ( సరోజినీ నాయుడు పాడారు ) భారతదేశ పతాక గీతంగా ఆమోదించబడింది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర వేడుకల్లో జెండా ఎగురవేసే సమయంలో శ్యాంలాల్ గుప్త రచించిన గీతంను ఆలాపిస్తుంటారు. 1969లో ఆనాటి భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డును శ్యాంలాల్ గుప్తకు ప్రదానం చేసి సత్కరించింది. 1997లో కేంద్ర సర్కారు శ్యాంలాల్ గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 

రాజకీయ నేపథ్యం....

 శ్యామ్ లాల్ గుప్తను  కుటుంబ వ్యాపారంలో చేరడానికి పెద్దలు నిరాకరించడంతో, అతను అధ్యాపక వృత్తిని స్వీకరించారు. కాన్పూర్‌లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేశారు. అదే సమయంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1921, 1930 మరియు 1944లో ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేయడంతో జైలు జీవితం కూడా అనుభవించారు. గుప్త 19 ఏళ్లపాటు ఫతేపూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్వాతంత్ర్యం వచ్చే వరకు పాదరక్షలు మరియు గొడుగులను ఉపయోగించలేదు. శ్యామ్ లాల్ గుప్త 10 ఆగస్టు 1977న 81 సంవత్సరాల వయస్సులో మరణించారు.


No comments:

Post a Comment