మరోవైపు.. ఆగస్టు 12 రెండో శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు చూసుకుంటే బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉన్నాయి. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులు సాధారణ సెలవులు ఉంటాయి. అలాగే ఇతర పండగలు, కార్యక్రమాల్లోనూ సెలవులు ఉంటాయి. అయితే, బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో సెలవులు ఉంటే కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. హాలిడేస్ అండ్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రూమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడేస్, క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్. ఈ బ్యాంకు సెలవు తీసుకున్నా ఈ మూడు కేటగిరీల్లోని ఒకదాని కిందకు వస్తుంది. అయితే, ప్రస్తుతం రోజుల్లో బ్యాంకులు మూసి ఉన్నా ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవు రోజుల్లో నగదు విత్ డ్రా, డిపాజిట్ చేయాల్సి వస్తే ఏటీఎంను ఉపయోగించుకోవచ్చు.
No comments:
Post a Comment