లంచం తీసుకుంటూ కేరళ పోలీసులకు చిక్కిన బెంగళూరు సైబర్ పోలీసులు !
By Mallikarjuna
బెంగళూరు/కొచ్చి: బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 26 లక్షలు మోసానికి పాల్పడిన సైబర్ క్రైమ్ నేరస్థుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన బెంగళూరు పోలీసులు అదే దొంగ నుంచి రూ. 3 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో పాటు ఆ డబ్బు తీసుకుంటున్న సమయంలో కేరళ పోలీసుల వలలో పడ్డారు. ఇప్పుడు కేరళ పోలీస్ స్టేషన్‌లో కుయ్యోమర్రో అంటూ బెంగళూరు పోలీసులు మూలుగుతున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
టాప్ హీరోయిన్ తో నిర్మాత సహజీవనం, నటి ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ !టాప్ హీరోయిన్ తో నిర్మాత సహజీవనం, నటి ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ !
సామాన్యులకు అన్యాయం జరిగితే న్యాయం చేయాలని పోలీసు స్టేషన్‌కు వెళుతున్నారు. అయితే ప్రజలకు నష్టం వచ్చి చచ్చిపోయినా పర్వాలేదు, మాకు లంచం ముఖ్యం అని కొందరు పోలీసులు అనుకుంటున్నారు. ఫిర్యాదు చేసిన అమాయక ప్రజలను మోసం చేసేందుకు పోలీసులు దొంగలతో చేతులు కలిపిన ఘటనలు వందల సంఖ్యలో వెలుగు చూశాయి.
కర్ణాటకలో రూ. 26 లక్షలు డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తూ అదే సమయంలో నేరస్థుడు కేరళలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. కేరళకు వెళ్లిన బెంగళూరు పోలీసులు దొంగతో చేతులు కలిపి లంచం డిమాండ్ చేశారు. రూ. 3 లక్షలు ఇస్తే నిన్ను అరెస్టు చెయ్యకుండా ఇక్కడే వదిలేసి వెళ్లిపోతామని నిందితుడితో డీల్ మాట్లాడుకున్నారు.
మాజీ మంత్రికి హైకోర్టు నోటీసులు, ఎమ్మెల్యే పదవికి ఎసరు ?, వేణుస్వామి ఎఫెక్ట్ !మాజీ మంత్రికి హైకోర్టు నోటీసులు, ఎమ్మెల్యే పదవికి ఎసరు ?, వేణుస్వామి ఎఫెక్ట్ !
కేసు పెట్టిన వ్యక్తికి అన్యాయం జరిగినా పర్వాలేదని, రూ. 3 లక్షలు లంచం తీసుకుని బెంగళూరు వెళ్లిపోదామని బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు డిసైడ్ అయ్యారు. నిందితుడి నుంచి లంచం డబ్బులు తీసుకోవడానికి బెంగళూరు పోలీసులు బయలుదేరారు. అేదే సమయంలో కేరళ దొంగ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటున్న బెంగళూరు పోలీసులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు పోలీసులను కేరళ పోలీసులు అరెస్టు చెయ్యడంతో కర్ణాటక పోలీసు శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. సైబర్ నేరగాడిని పట్టుకోవడానికి వెళ్లిన బెంగళూరు సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ముగ్గురు పోలీసు అధికారులను కేరళ పోలీసులు అరెస్టు చేశారని వెలుగు చూడటంతో కర్ణాటక పోలీసు శాఖ అధికారులు బిత్తరపోయారు. వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు అరెస్టు అయ్యారు.
ఎగ్ రైస్ కోసం వెళితే ప్రాణాలు పోయాయి, పై నుండి వాటర్ ట్యాంక్ లు !ఎగ్ రైస్ కోసం వెళితే ప్రాణాలు పోయాయి, పై నుండి వాటర్ ట్యాంక్ లు !
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు మోసం చేసి ఆన్‌లైన్‌లో రూ. 26 వసూలు చేసి మోసం చేశారు. మోసపోయానని గుర్తించిన బెంగళూరుకు చెందిన చందక్ శ్రీకాంత్ వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారిస్తున్న వైట్‌ఫీల్డ్ సీఈఎన్ పోలీసులకు మడికేరికి చెందిన ఐజాక్ అనే వ్యక్తిని గురించి మొదట అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా నిందితుడు ఐజాక్ బ్యాంకు ఖాతాలో రూ. 2 కోట్లు నగదు ఉన్నట్లు గుర్తించారు. వివిద బ్యాంక్ అకౌంట్ ల నుంచి నగదు బదిలీ అయ్యిందని పోలీసులు గుర్తించారు.
Kerala Police
ఐజాక్ ఇచ్చిన సమాచారంతో బెంగళూరు పోలీసులు కేరళ వెళ్లారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ సీఈఎన్ ఇన్‌స్పెక్టర్ శివప్రకాష్ బృందం కేరళలోని కొచ్చిలో నివాసం ఉంటున్న నౌషాద్ పేరుతో ఆన్‌లైన్ మోసం జరిగినట్లు సమాచారం అందింది. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు కేరళలోని కొచ్చిలోని కల్లంచేరి వెళ్లిన వైట్ ఫీల్డ్ సీఈఎన్ పోలీసులు నిందితుడు నౌషాద్ ను గుర్తించారు.
డేటింగ్ యాప్, న్యూడ్ వీడియో కాల్స్, కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్, కిలాడీ గ్యాంగ్ !డేటింగ్ యాప్, న్యూడ్ వీడియో కాల్స్, కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్, కిలాడీ గ్యాంగ్ !
నిన్ను అరెస్టు చెయ్యకుండా కేరళలోనే వదిలేసి వెళ్లిపోవాలంటే మాకు రూ. 3 లక్షలు లంచం ఇవ్వాలని బెంగళూరు పోలీసులు డిమాండ్ చేశారు. ఈ సమయంలో నిందితుడు నౌషాద్ కొచ్చిలోని కల్లంచెరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా బెంగళూరు నుంచి వెళ్లిన పోలీసులను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ సమయంలో సైబర్ క్రైమ్ కేసును విచారించేందుకు వచ్చామని బెంగళూరు పోలీసులు కేరళ పోలీసులకు చెప్పారు. బెంగళూరు పోలీసుల మాటలను కల్లంచేరి పోలీసులు ఏమాత్రం వినకుండా ఇన్‌స్పెక్టర్ శివప్రకాష్ తో సహా ముగ్గురు బెంగళూరు పోలీసులను అదుపులోకి తీసుకుని టకటకా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెంగళూరు ఇన్‌స్పెక్టర్ శివప్రకాష్ తో పాటు మరో ఇద్దరు పోలీసులు కేరళలోని కొచ్చిలోని కల్లంచెరి పోలీసుల అదుపులో ఉన్నారు. ఓ కేసులో లంచం డిమాండ్ చేసిన బెంగళూరు పోలీసులు పక్క రాష్ట్రం పోలీసులకు చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
No comments:
Post a Comment