Friday, 11 August 2023

"పేట" సిగ లో పారిశ్రామిక కిరీటం 69 ఎకరాల్లో... సకల హంగులతో ఆటోనగర్ లో టి.ఎస్.ఐ.ఐ.సి కార్పొరేషన్ ఎండి నర్సింహ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్ లతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష



ఆటోనగర్ లో టి.ఎస్.ఐ.ఐ.సి  కార్పొరేషన్ ఎండి నర్సింహ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్ లతో  మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష






ఉపాధి కి కేరాఫ్ కానున్న ఇమామ్ పేట పారిశ్రామిక వాడ


ఆటోనగర్ లో నిర్మితం కానున్న కార్మిక భవనం,ఈ.ఎస్.ఐ ఆసుపత్రి 


 రూ16 కోట్ల మంజూరు కు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం 


స్పీడు అందుకోనున్న  నిర్మాణ పనులు 


స్థానికంగా పెరుగనున్న ఉపాధి అవకాశాలు









 సూర్యాపేట 

అభివృద్ధి లో పరుగులు పెడుతున్న సూర్యాపేట ఒడిలో  ఇమామ్ పేట ఆటోనగర్ మరో మణిహారం కానుంది.  జిల్లాకేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఇమామ్ పేట లో  ఆటోనగర్ నిర్మాణానికి సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 69 ఎకరాల్లో  ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం ఇమామ్ పేటలోని ఆటోనగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఎండి నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఆర్డీవో ఇతర అధికారులతో కలిసి ఆటోనగర్ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి చొరవ తో 

త్వరలో వందలాది పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. తాజాగా ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్‌ పార్క్‌తో యువతకు, కార్మికులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.దే మేరకు నిర్మాణాలను కోసం రూ. 16 కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


 సకల హంగులు.. అద్భుత నిర్మాణాలు 


 కార్మిక భవనం,ఈ.ఎస్.ఐ ఆసుపత్రి,విశాల రహదారులు, అబ్బురపరిచే కమాన్ లు 

     నభూతో.. నభవిష్యత్ అన్న రీతిలో ఇమామ్ పేట ఇండస్ట్రియల్ పార్క్ లో సకల హంగులతో నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. పారిశ్రామిక  పార్క్ ముందు ఆకట్టుకునే కమాన్, ముందు రహదారి నుండి  చివరి వరకు విశాలమైన రహదారులు, కార్మికుల శ్రేయస్సు కోసం కార్మిక సంక్షేమ భవనం, వారి ఆరోగ్యంకోసం  సకల సదుపాయాలతో ఈ.ఎస్.ఐ ఆసుపత్రి వంటి నిర్మాణాలు రూపు దిద్దుకొనున్నాయి.. నిర్మాణాలల నాణ్యత లో రాజీ పడే ప్రసక్తేలేదని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులకు సూచించారు. అతి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అత్యాధునిక పారిశ్రామిక పార్క్ లో ఇంకా చేపట్టవలసిన నిర్మాణాలు, సౌకర్యాల పై ప్రణాళికలు సిద్ధాంత చేయాలని అధికారులను ఆదేశించారు.

No comments:

Post a Comment